Cardamom for Skin: పండగకి మీ ముఖం వెలిగి పోవాలంటే.. యాలకులతో ఈ ఫేస్ ప్యాక్ బెస్ట్!

ప్రస్తుతం ఇప్పుడు వచ్చేది అంతా పండుగల సీజనే. పండుగలకు మరింత అందంగా రెడీ అవుతూ ఉంటారు మహిళలు. అలాగే మరింత అందంగా కనిపించాలని ఆరట పడుతూ ఉంటారు. ఇందులో కోసం ఫేస్ ప్యాక్స్, బ్యూటీ పార్లర్స్‌కి కూడా వెళ్తూ ఉంటారు. కానీ పెద్దగా ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే మన అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. మన ఇంట్లో నిత్యం ఉపయోగించే వాటిల్లో యాలకులు కూడా ఒకటి. యాలకుల గురించి ప్రత్యేకంగా..

Cardamom for Skin: పండగకి మీ ముఖం వెలిగి పోవాలంటే.. యాలకులతో ఈ ఫేస్ ప్యాక్ బెస్ట్!
Cardamom for skin
Follow us

|

Updated on: Oct 07, 2024 | 2:34 PM

ప్రస్తుతం ఇప్పుడు వచ్చేది అంతా పండుగల సీజనే. పండుగలకు మరింత అందంగా రెడీ అవుతూ ఉంటారు మహిళలు. అలాగే మరింత అందంగా కనిపించాలని ఆరట పడుతూ ఉంటారు. ఇందులో కోసం ఫేస్ ప్యాక్స్, బ్యూటీ పార్లర్స్‌కి కూడా వెళ్తూ ఉంటారు. కానీ పెద్దగా ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే మన అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. మన ఇంట్లో నిత్యం ఉపయోగించే వాటిల్లో యాలకులు కూడా ఒకటి. యాలకుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. యాలకులు తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. యాలకులకు భారతీయ వంటల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. యాలకుల్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి అందాన్ని పెంచడంలో కూడా సహాయ పడతాయి. మరి యలకులతో ఎలా ముఖాన్ని మెరిపించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

ఫేస్ స్క్రబ్:

యాలకులతో ఫేస్ స్క్రబ్ వేసుకోవచ్చు. దీంతో చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ అనేవి తొలగిపోయి చర్మం ఆకర్షణీయంగా మారుతుంది. ఒక చిన్న బౌల్ లోకి యాలకుల పొడిని, కొద్దిగా తేనె, చిటికెడు పంచదార కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించి మర్దనా చేయండి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

హైడ్రేషన్ మాస్క్:

నీటిని ఎక్కువగా తాగుతూ ఉంటే చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది. చర్మం హైడ్రేట్‌గా ఉండటం వల్ల మీలో నేచురల్ గ్లో వస్తుంది. ఇలా యాలకులతో కూడా మీ చర్మాన్ని హైడ్రేట్ చేసుకోవచ్చు. ఒక బౌల్‌లో కొద్దిగా తేనె, యాలకుల పొడి వేసి కలిపి ముఖానికి అప్లై చేయండి. ఓ 10 నిమిషాల తర్వాత కడిగేస్తే చాలు.

ఇవి కూడా చదవండి

పెదాల అందానికి..

యాలకుల పొడితో కేవలం ముఖ సౌందర్యమే కాకుండా పెదాల అందాన్ని కూడా కాపాడుకోవచ్చు. పైన చెప్పిన పంచదార, యాలకుల పొడి మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసి మర్దనా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

టోనర్‌గా పని చేస్తుంది:

యాలకులను ఫేస్ టోనర్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఒక గిన్నెలో కొద్దిగా యాలకుల పొడి, ఒక కప్పు రోజ్ వాటర్ కలపండి. వీటిని ఓ గంట పాటు పక్కకు వదిలేయండి. ఆ తర్వాత ఓ డబ్బాలో వేసి స్టోర్ చేసుకుని.. రోజూ ముఖానికి స్ప్రే చేయండి. ఇలా చేయడం వల్ల మంచి గ్లో వస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!
గ్యాస్‌ వినియోగదారులకు మరోసారి షాక్‌.! ధర పెంచుతూ ప్రకటన..
గ్యాస్‌ వినియోగదారులకు మరోసారి షాక్‌.! ధర పెంచుతూ ప్రకటన..
యూట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.! అరెస్ట్‌.?
యూట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.! అరెస్ట్‌.?
హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!
హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!
ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..
ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..
ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా!
ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా!
అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌ న్యూస్‌.! 2.5 లక్షల వీసాలు.
అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌ న్యూస్‌.! 2.5 లక్షల వీసాలు.
అన్ని సేవలకు ఇక ఒకే కార్డు.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.!
అన్ని సేవలకు ఇక ఒకే కార్డు.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.!
నీలి చిత్రాల్లో నటించే భామ రెజ్యూమ్.. అయినా 29 ఇంటర్వ్యూ కాల్స్‌.
నీలి చిత్రాల్లో నటించే భామ రెజ్యూమ్.. అయినా 29 ఇంటర్వ్యూ కాల్స్‌.
జనం కోసం 125 మొసళ్లను ఏం చేశాడంటే.? పాపం మూగజీవాలు..
జనం కోసం 125 మొసళ్లను ఏం చేశాడంటే.? పాపం మూగజీవాలు..