Cucumber Side Effects: సలాడ్ ప్రియులకు షాక్.. రోజూ కీరదోస తింటున్నారా? ఇది తెలిస్తే గుండే గుభేల్!
ఆరోగ్యానికి చలవ.. మరి అతిగా తింటే ఏమవుతుంది?.. వేసవి కాలంలో దాహం తీర్చుకోవడానికి దోసకాయను మించినది లేదు. కానీ ఈ ఆరోగ్యకరమైన కూరగాయ వల్ల కొన్ని అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే నమ్ముతారా? అవేంటో తెలుసుకోవడం చాలా అవసరం. దోసకాయలో 90 శాతం నీరు ఉంటుంది, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే ఏదైనా మోతాదు మించితే ప్రమాదకరమే. దోసకాయను అమితంగా తీసుకోవడం వల్ల శరీరంలో కలిగే వింత మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సలాడ్లలో, జ్యూసుల్లో విరివిగా వాడే దోసకాయ వల్ల శరీరానికి ఎన్ని లాభాలు ఉన్నాయో, అతిగా వాడితే అన్ని నష్టాలు ఉన్నాయి. సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడైనా దొరికే ఈ కీరదోసలో ఎన్నో సుగుణాలు దాగి ఉన్నాయి. దీన్నే దోసకాయ అని కూడా పిలుస్తారు. దోసకాయ వల్ల కలిగే కొన్ని అరుదైన సమస్యలు ఇక్కడ ఉన్నాయి..
1. విషపూరిత రసాయనాలు (Toxins) కొన్ని దోసకాయలు కట్ చేసినప్పుడు చాలా చేదుగా ఉంటాయి. ఇందులో ‘కుకుర్బిటాసిన్స్’, ‘టెట్రాసైక్లిక్ ట్రైటెర్పెనాయిడ్’ వంటి రసాయనాలు ఉండటమే దీనికి కారణం. ఈ చేదు పదార్థాలు శరీరంలోకి చేరితే అలర్జీలు రావడమే కాకుండా, కొన్నిసార్లు అది ప్రాణాపాయానికి కూడా దారితీయవచ్చు.
2. శరీరంలో నీటి కోల్పోవడం (Dehydration) దోసకాయ గింజల్లో ‘కుకుర్బిటిన్’ అనే సమ్మేళనం ఉంటుంది. దీనికి మూత్రవిసర్జనను పెంచే గుణం ఉంది. మోతాదుకు మించి దోసకాయలు తింటే, శరీరం నుండి అతిగా నీరు బయటకు వెళ్లిపోయి డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది.
3. కిడ్నీ సమస్యలు దోసకాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. కానీ అతిగా తింటే రక్తంలో పొటాషియం స్థాయిలు పెరిగి ‘హైపర్‌కలేమియా’ అనే స్థితికి దారి తీస్తుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, తిమ్మిర్లు, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇది కిడ్నీల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది.
4. రక్తనాళాలపై ఒత్తిడి దోసకాయలో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. అతిగా తినడం వల్ల శరీరంలోకి ద్రవాలు ఎక్కువగా చేరి రక్త పరిమాణం (Blood Volume) పెరుగుతుంది. ఇది గుండెకు రక్తాన్ని పంపిణీ చేసే రక్తనాళాలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత దెబ్బతింటుంది.
దోసకాయ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, చేదుగా ఉన్నవాటిని తినకపోవడం ఉత్తమం. అలాగే ఏ ఆహారమైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.




