AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Voice Translation: లైవ్‌లోనే ఆటోమేటిక్‌గా వాయిస్ ట్రాన్సలేషన్.. ఈ అద్భుత ఫీచర్ గురించి తెలిస్తే మీరు వదిలిపెట్టరు

గూగుల్ ట్రాన్సలేటర్ గురించి మనందరికీ తెలిసిందే. లాంగ్వేజ్ ట్రన్సాలేషన్ కోసం అందరూ వాడుతూ ఉంటారు. ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి లేదా తెలుగు నుంచి ఇంగ్లీష్‌లోకి స్క్రీప్ట్‌ను మార్చడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వాయిస్ ట్రాన్సలేషన్ ఫీచర్ గురించి చాలామందికి ఐడియా ఉండదు.

Voice Translation: లైవ్‌లోనే ఆటోమేటిక్‌గా వాయిస్ ట్రాన్సలేషన్.. ఈ అద్భుత ఫీచర్ గురించి తెలిస్తే మీరు వదిలిపెట్టరు
Google Voice Translation
Venkatrao Lella
|

Updated on: Dec 22, 2025 | 10:47 AM

Share

మనకి తెలియని భాష ఎవరైనా మాట్లాడేటప్పుడు ఏం అర్థం కాదు. అవతలి వాళ్లు ఏం మాట్లాడుతున్నారనేది అర్దం చేసుకోవడం కష్టతరంగా ఉంటుంది. వివిధ రాష్ట్రాలకు వెళ్లినప్పుడు స్థానిక భాష తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాం. వాళ్ల భాష మనకు అర్ధం కాక, మనం చెప్పేది వాళ్లకి తెలియక తికమక పడుతూ ఉంటారు. ఇక నుంచి మీరు అలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి వారికి బెస్ట్ ఆప్షన్ గూగుల్ లైవ్ వాయిస్ ట్రాన్సలేటర్. దీని సహాయంతో మీరు ఎదుటివారు మాట్లాడే మాటలను మీకు నచ్చిన భాషలో వినవచ్చు. మీ ఫోన్‌లో ఇలాంటి ఫీచర్ ఉందని చాలామందికి తెలియదు. మీరు హెడ్‌ఫోన్ లేదా వైర్‌లెస్ హెడ్‌ఫోన్ కనెక్ట్ చేసుకుని ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

సెటప్ చేసుకోండిలా..

-మీ ఫోన్‌లో గూగుల్ ట్రాన్సలేట్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి -ఆ తర్వాత యాప్ ఓపెన్ చేసి ఎడమవైపున మీరు మాట్లాడే భాషను.. కుడివైపున అవతలి వ్యక్తి మాట్లాడే భాషను సెలక్ట్ చేసుకుంది -స్క్రీన్ క్రింద ఎడమవైపున సంభాషణ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి -ఆ తర్వాత స్టార్ట్‌పై క్లిక్ చేసి అవతలి వ్యక్తికి దగ్గరగా ఫోన్ ఉంచండి -మీరు హెడ్‌ఫోన్స్‌ను కనెక్ట్ చేసుకుంటే అవతలి వ్యక్తి మాట్లాడే మాటలు మీ భాషలోకి ఆటోమేటిక్‌గా ట్రాన్సలేట్ అయ్యి మీ భాషలో వినబడుతాయి

ఈ జాగ్రత్తలు తీసుకుంటే బెటర్

ఎక్కువమంది ఒకేసారి మాట్లాడితే ట్రాన్సలేట్ సరిగ్గా అవ్వదు. పక్కన ఎలాంటి డిస్టెబన్స్ లేకుండా ఉంటే మంచిది. ఫోన్ స్పీకర్ నోటికి దగ్గరగా పెడితే ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్షన్ స్టేబుల్‌గా ఉండాలి. ఏదైనా సరిగ్గా వినిపించచకపోతే మళ్లీ రిపీట్ చేసి వినవచ్చు. ప్రస్తుతం బీటా వెర్షన్‌లో 70 కంటే ఎక్కువ భాషలను ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక యాపిల్ ఫోన్లలో కూడా ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.  పర్యాటకులకు ఈ యాప్ బాగా ఉపయోగపుతుంది. మీరు ఏదైనా రాష్ట్రాన్ని విజిట్ చేసిప్పుడు అక్కడి స్థానికుల భాష అర్దం కాదు. అలాంటి సమయంలో ఈ యాప్ ద్వారా మీరు వారి మాాటలను అర్థం చేసుకోవచ్చు.