Mustafizur Rahman : కేకేఆర్ పెట్టిన ప్రతి పైసాకు న్యాయం చేసిన ముస్తఫిజుర్.. 23 బంతుల్లోనే విధ్వంసం.. ప్రత్యర్థి జట్టు విలవిల!
Mustafizur Rahman : ఐపీఎల్ 2026 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తఫిజుర్ రెహమాన్ తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. డిసెంబర్ 16న జరిగిన వేలంలో ఊహించని రేటు దక్కించుకున్న ఈ కట్టర్ మాస్టర్, సరిగ్గా ఐదు రోజుల తర్వాత (డిసెంబర్ 21న) మైదానంలో నిప్పులు చెరిగే బంతులతో చెలరేగిపోయాడు.

Mustafizur Rahman : ఐపీఎల్ 2026 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తఫిజుర్ రెహమాన్ తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. డిసెంబర్ 16న జరిగిన వేలంలో ఊహించని రేటు దక్కించుకున్న ఈ కట్టర్ మాస్టర్, సరిగ్గా ఐదు రోజుల తర్వాత (డిసెంబర్ 21న) మైదానంలో నిప్పులు చెరిగే బంతులతో చెలరేగిపోయాడు. యూఏఈ వేదికగా జరుగుతున్న ILT20 టోర్నీలో దుబాయ్ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న ముస్తఫిజుర్, కేవలం 23 బంతుల్లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.
ముస్తఫిజుర్ తన బేస్ ప్రైస్‌ను రూ. 2 కోట్లుగా నిర్ణయించుకోగా, వేలంలో కేకేఆర్ అతడిని ఏకంగా రూ.9.20 కోట్లకు దక్కించుకుంది. అంటే తను ఆశించిన దానికంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ ధర లభించింది. ఈ భారీ ధరపై కొందరు విమర్శలు చేసినప్పటికీ, అబుదాబిలో గల్ఫ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముస్తఫిజుర్ తన స్పెల్‌తో వారందరికీ సమాధానం చెప్పాడు. 3.5 ఓవర్లలో (23 బంతులు) కేవలం 34 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా గల్ఫ్ జెయింట్స్ కెప్టెన్ జేమ్స్ విన్స్, అజ్మతుల్లా ఒమర్జాయ్ వంటి సెట్ అయిన బ్యాటర్లను అవుట్ చేసి ప్రత్యర్థిని 156 పరుగులకే కట్టడి చేశాడు.
ఈ మ్యాచ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించగా, ముస్తఫిజుర్ తన అద్భుత ప్రదర్శనకు గానూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ముస్తఫిజుర్ వేసే స్లోయర్ కట్టర్లు, డెత్ ఓవర్లలో వేరియేషన్లే అతడికి ఇంతటి డిమాండ్ తెచ్చిపెట్టాయి. వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కూడా ఇతడి కోసం గట్టిగా పోటీ పడినప్పటికీ, కేకేఆర్ పట్టుబట్టి మరీ భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది. ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముస్తఫిజుర్ ఇలాంటి భీభత్సమైన ఫామ్‌లో ఉండటం కేకేఆర్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




