AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smriti Mandhana : స్మృతి మంధాన స్పెషల్ రిప్లై.. ఆ చిన్నారి హ్యాపీనెస్ మామూలుగా లేదుగా!

Smriti Mandhana : టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె మైదానంలో చేసిన పరుగుల వల్ల కాదు, ఒక చిన్నారి అభిమాని పట్ల చూపిన అమితమైన ప్రేమతో నెటిజన్లు, జనాల మనసు గెలుచుకున్నారు.

Smriti Mandhana : స్మృతి మంధాన స్పెషల్ రిప్లై.. ఆ చిన్నారి హ్యాపీనెస్ మామూలుగా లేదుగా!
Smriti Mandhana (2)
Rakesh
|

Updated on: Dec 22, 2025 | 11:52 AM

Share

Smriti Mandhana : టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె మైదానంలో చేసిన పరుగుల వల్ల కాదు, ఒక చిన్నారి అభిమాని పట్ల చూపిన అమితమైన ప్రేమతో నెటిజన్ల మనసు గెలుచుకున్నారు. కాశ్మీర్‌లోని అరు వ్యాలీకి చెందిన ఒక చిన్నారి అభిమాని కోరికకు స్మృతి స్పందించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌కు ముందు జరిగిన ఈ సంఘటన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ ఇటీవల కాశ్మీర్‌లో పర్యటించారు. అక్కడ ఆయన అరు వ్యాలీలో కెమెరాతో తిరుగుతుండగా ఒక చిన్నారి తారసపడింది. ఆ చిన్నారి తనకు స్మృతి మంధాన అంటే చాలా ఇష్టమని, తాను ఆమెకు పెద్ద అభిమానినని దర్శకుడితో చెప్పింది. ఈ విషయాన్ని స్మృతికి చేరవేయాలని కూడా కోరింది. కబీర్ ఖాన్ ఆ చిన్నారి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “కాశ్మీర్ అందాలు ఎప్పుడూ నన్ను ఆశ్చర్యపరుస్తాయి. ఈ చిన్నారి తన అభిమాన ప్లేయర్ స్మృతి అని చెప్పమని కోరింది. ఈ పోస్ట్ స్మృతికి చేరుతుందని ఆశిస్తున్నాను” అని రాశారు.

ఈ పోస్ట్ చూసిన వెంటనే స్మృతి మంధాన ఎంతో ఆప్యాయంగా స్పందించారు. “అరు వ్యాలీలోని ఆ చిన్న ఛాంపియన్‌కు నా తరపున ఒక పెద్ద హగ్ ఇవ్వండి.. నేను కూడా ఆమె కోసం ఎదురుచూస్తున్నానని చెప్పండి” అంటూ రీ-ట్వీట్ చేశారు. స్మృతి చూపిన ఈ ప్రేమపూర్వక స్పందన నెటిజన్లను ఫిదా చేసింది. స్మృతి కేవలం గొప్ప క్రికెటర్ మాత్రమే కాదు, అంతకంటే గొప్ప మనసున్న వ్యక్తి అని ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాశ్మీర్ పర్వతాల మధ్య గలగల పారే నదుల పక్కన క్రికెట్ ఆడుకునే ఆ పిల్లల ఉత్సాహానికి స్మృతి మద్దతు తెలపడం ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది.

మరోవైపు, స్మృతి మంధాన తన కెరీర్‌లో ఒక భారీ రికార్డుకు చేరువయ్యారు. శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆమె 4,000 టీ20 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన రెండో క్రీడాకారిణిగా (న్యూజిలాండ్ సుజీ బేట్స్ తర్వాత) నిలిచారు. ఇటీవల ముగిసిన మహిళా వన్డే ప్రపంచకప్‌లో కూడా 434 పరుగులు సాధించి, ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా మిథాలీ రాజ్ రికార్డును స్మృతి తిరగరాశారు. ఈ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూనే, మైదానం బయట కూడా ఇలాంటి పనులతో అందరి మనసు గెలుచుకుంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..