Gold Price: మహిళలకు భారీ షాక్.. రికార్డ్ స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు!
Gold Price Today: ఈ ఏడాది బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించాయి. వచ్చే ఏడాదిలో కూడా ఈ ధరల పెరుగుదల కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే హాలిడే సీజన్ ప్రారంభం కావడంతో అంతర్జాతీయ..

మహిళలకు బంగారం, వెండి ధరలు భారీ షాకిచ్చాయి. రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు సోమవారం రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. అయితే బంగారం ధరలు ప్రతి రోజు ఉదయం 10 గంటల సమయంలో అప్‌డేట్ అవుతుంటాయి. అలాగే ఈ రోజు కూడా అప్‌డేట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తులం బంగారంపై ఏకంగా 11,000 రూపాయలు పెరుగగా, వెండి మాత్రం అంతకు మించి దూసుకుపోతోంది. దీనిపై 5000 రూపాయల వరకు ఎగబాకింది. ఇక దేశీయంగా ధర పెరిగిన తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,280 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,000 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి విషయానికొస్తే కిలోపై 2 లక్షల19 వేల రూపాయల వద్ద కొనసాగుతోంది. అదే హైదరాబాద్, కేరళ, చెన్నైలలో అయితే కిలో వెండి ధర 2 లక్షల 31 వేల రూపాయల వద్ద కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Traffic Challans: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ట్రాఫిక్ చలాన్స్ రద్దు.. ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,35,280 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,24,000 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,35,430 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,24,050 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,35,280 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,24,000 వద్ద కొనసాగుతోంది.
ఈ ఏడాది బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించాయి. వచ్చే ఏడాదిలో కూడా ఈ ధరల పెరుగుదల కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే హాలిడే సీజన్ ప్రారంభం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ట్రేడింగ్ పరిమాణం తగ్గడం, లాభాల స్వీకరణ జరగడం వల్ల పసిడి ధరలు కొంత దిద్దుబాటుకు లోనయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక భారత్‌లో ఇప్పటికే బంగారం, వెండి ధరలు సరికొత్త గరిష్ఠాలను నమోదు చేయడం గమనార్హం.
Winter Crop: మెంతి, పాలకూర పంటతో భారీగా లాభాలు.. సాగు విధానం, పెట్టుబడి వివరాలు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








