AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: ఈఎంఐలు మరింత తగ్గనున్నాయ్.. న్యూ ఇయర్ వేళ ఆర్బీఐ మరో శుభవార్త..!

లోన్లు తీసుకున్నవారికి ఆర్బీఐ మరో గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్దమవుతోంది. ఫిబ్రవరిలో ఆర్బీఐ సమీక్షా సమావేశం మరోసారి జరగనుంది. ఈ మీటింగ్‌లో వడ్డీ రేట్ల తగ్గింపుపై మరోసారి నిర్ణయం తీసుకునే అవకాశముంది. రెపో రోటును మరోసారి తగ్గించవచ్చని నివేదికలు వెలువడుతున్నాయి. ఇదే జరిగితే ఏమవుతుంది..?

RBI: ఈఎంఐలు మరింత తగ్గనున్నాయ్.. న్యూ ఇయర్ వేళ ఆర్బీఐ మరో శుభవార్త..!
Money
Venkatrao Lella
|

Updated on: Dec 22, 2025 | 11:14 AM

Share

దేశ ప్రజలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్దమవుతోంది. ఇటీవల ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన విషయం తెలిసిందే. గతంలో 5.50 శాతంగా ఉన్న రెపో రేటును 5.25 శాతానికి పరిమితం చేసింది. మూడు రోజుల పాటు జరిగిన ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్బీఐ ప్రకటనతో బ్యాంకులన్నీ వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తున్నాయి. దీని వల్ల ఫ్లోటింగ్ రేటు వడ్డీ ఆప్షన్‌ ఎంచుకుని లోన్లు తీసుకున్నవారిని ఈఎంఐ తగ్గనుంది. అలాగే కొత్తగా తీసుకునేవారికి తక్కువ వడ్డీకే రుణాలు అందనున్నాయి. ఈ క్రమంలో త్వరలో ఆర్బీఐ మరోసారి శుభవార్త అందించనుందని తెలుస్తోంది. అదేంటంటే..?

ఆర్బీఐ మరోసారి రెపో రేటును తగ్గిచంనుందని తెలుస్తోంది. ఫిబ్రవరిలో మరోసారి ఆర్బీఐ మానీటరీ పాలసీ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లో చర్చించి రెపో రెటును మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశముందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నివేదికలో తెలిపింది. ఇదే జరిగితే ప్రస్తుతం 5.25 శాతంగా ఉన్న రెపో రేటు 5 శాతానికి పడిపోనుంది. దీని వల్ల లోన్ల ఈఎంఐలు భారీగా తగ్గనున్నాయి. అంతేకాకుండా అతి తక్కువ వడ్డీకే కొత్తగా రుణాలు పొందే అవకాశముంది. ఫిబ్రవరి లేదా ఏప్రిల్‌లో ఆర్బీఐ మరోసారి సమీక్షా సమావేశం నిర్వహించనుంది. కఠినమైన పరిస్థితుల క్రమంలో ఫిబ్రవరిలోనే సమావేశం జరిగే అవకాశముందని, రెపో రేటును తగ్గించే అవకాశం ఖచ్చితంగా ఉందని తన రిపోర్టులో వెల్లడించింది.

రెపో రేటును 5 శాతానికి దిగువకు కూడా తగ్గించే అవకాశం లేకపోలేదని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నివేదికలో పొందుపర్చింది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించి ధరల ఒత్తిళ్ల గురించి ఆర్బీఐ పలుమార్లు ప్రస్తావించిన క్రమంలో రెపో రేటును తగ్గించే అవకాశాలే ఉన్నాయని అంచనా వేసింది. ఈ ఏడాదిలో ఇప్పటికే నాలుగుసార్లు రెపో రెపో రేటును తగ్గించారు. వచ్చే ఏడాదిలో తగ్గిస్తే రుణాలు మరింత చవకకు లభించే అవకాశముంది. మరి ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

లోకల్ ట్రైన్‌లో దారుణం..అందరూ చూస్తుండగానే..!
లోకల్ ట్రైన్‌లో దారుణం..అందరూ చూస్తుండగానే..!
లోన్లు తీసుకున్నవారికి న్యూ ఇయర్‌లో గుడ్‌న్యూస్.. ఈఎంఐలు తగ్గింపు
లోన్లు తీసుకున్నవారికి న్యూ ఇయర్‌లో గుడ్‌న్యూస్.. ఈఎంఐలు తగ్గింపు
5 సినిమాలు..100 కోట్లు.. రికార్డు క్రియేట్ చేసిన సీనియర్ హీరో
5 సినిమాలు..100 కోట్లు.. రికార్డు క్రియేట్ చేసిన సీనియర్ హీరో
దోసకాయ అమృతమే.. కానీ అతిగా తింటే ఈ వింత సమస్యలు తప్పవు!
దోసకాయ అమృతమే.. కానీ అతిగా తింటే ఈ వింత సమస్యలు తప్పవు!
అద్భుతం.. 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా
అద్భుతం.. 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా
మహిళలకు భారీ షాక్‌..రికార్డ్‌ స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు
మహిళలకు భారీ షాక్‌..రికార్డ్‌ స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు
లైవ్ వాయిస్ ట్రాన్సలేషన్.. ఇలా సెట్ చేసుకుంటే మీకు నో ప్రాబ్లం
లైవ్ వాయిస్ ట్రాన్సలేషన్.. ఇలా సెట్ చేసుకుంటే మీకు నో ప్రాబ్లం
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి!
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి!
ఉక్రెయిన్ బందీ నుంచి విడిపించండి.. గుజరాత్ విద్యార్థి వేడుకోలు!
ఉక్రెయిన్ బందీ నుంచి విడిపించండి.. గుజరాత్ విద్యార్థి వేడుకోలు!
మీరు గోల్డ్‌ లోన్‌ తీసుకుంటున్నారా? రూల్స్‌ మరింత కఠినం!
మీరు గోల్డ్‌ లోన్‌ తీసుకుంటున్నారా? రూల్స్‌ మరింత కఠినం!