Amla Benefits: ఆరోగ్య సిరి..ఉసిరిని ఇలా వాడారంటే.. జుట్టు ఒత్తుగా నడుము కింద వరకు పెరగడం పక్కా..!
ఉసిరిని ఆరోగ్యసిరిగా పిలుస్తారు. ఎందుకంటే..దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ప్రయోజనాలు నిండి వున్నాయి. ముఖ్యంగా ఉసిరి చర్మం,జుట్టు సమస్యలకు తిరుగులేని రామబాణంగా పనిచేస్తుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉసిరితో కొన్ని రెమిడీస్ పాటించటం వల్ల మీ జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుందని చెబుతున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఉసిరి సీజన్ వచ్చేసింది..అవును చలికాలం అంటేనే మార్కెట్ నిండా రకరకాల పండ్లు, కూరగాయలు ఎక్కువగా కనిపిస్తాయి. వాటిలో ఉసిరి కూడా పుష్కలంగా లభిస్తాయి. ఉసిరిని ఆరోగ్యసిరిగా పిలుస్తారు. ఎందుకంటే..దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ప్రయోజనాలు నిండి వున్నాయి. ముఖ్యంగా ఉసిరి చర్మం,జుట్టు సమస్యలకు తిరుగులేని రామబాణంగా పనిచేస్తుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉసిరితో కొన్ని రెమిడీస్ పాటించటం వల్ల మీ జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుందని చెబుతున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళితే…
ఉసిరికాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది , కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఉసిరికాయలోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. తద్వారా జుట్టు పెరుగుదల ఆరోగ్యంగా ఉంటుంది. ఉసిరికాయలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రును సమర్థవంతంగా నివారించడంలో సహాయపడతాయి.
ఉసిరిలో పుష్కలమైన విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఉసిరికాయ జుట్టుకు సహజమైన కండీషనర్‌గా పనిచేస్తుంది. ఇది జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. ఉసిరికాయ జుట్టు సహజ రంగును కాపాడటానికి సహాయపడుతుంది. తెల్ల జుట్టును నివారిస్తుంది. ఉసిరికాయ స్కాల్ప్ pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. ఆరోగ్యకరమైన స్కాల్ప్‌ను ప్రోత్సహిస్తుంది.
ఉసిరిని ఎండలో ఆరబెట్టి పెట్టి మిక్సిలో వేసి పౌడర్ లా చేసి కొబ్బరి నూనెలో కలపాలి. ఈనూనెను ముఖ్యంగా జుట్టురాలుతున్న వారు, జుట్టు పల్చగా ఉన్న వారు తరచూ వాడుతూ ఉండాలి. రోజు రాత్రిపూట ఈ నూనె తలకు బాగా అప్లై చేసుకుని ఉదయం తలస్నానం చేయాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లో మీ జుట్టు పొడవుగా, దట్టంగా పెరుగుతుంది. అదే విధంగా జుట్టు రాలిపోవడం, జుట్టు చిట్లిపోవడం వంటి సమస్యలు ఉండవు. ఉసిరిని నేరుగా తినడం వల్ల కూడా జుట్టు రాలడం సమస్యలు పూర్తిగా నయమౌతాయి. జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యల్ని కూడా ఉసిరిలో ఉండే గుణాలు దూరం చేస్తాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








