పెద్ద పేగు క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఇవే!
ప్రస్తుతం క్యాన్సర్ కేసులు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. ఊహించని విధంగా క్యాన్సర్ అనేది చాప కింద నీరులా విస్తరిస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పెద్ద పేగు క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కాగా, ఇప్పుడు మనం పెద్ద పేగు క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఏవో చూద్దాం.
Updated on: Nov 08, 2025 | 2:59 PM

ప్రస్తుతం పెద్ద పేగు క్యాన్సర్ కేసులు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు చాలా మంది దీని బారినపడుతున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది యుక్త వయసులో ఉన్న వారు కూడా పెద్ద పేగు క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు విడిచిన వారు చాలా మందే ఉన్నారు. అయితే ఇది ప్రాణంతాకంగా మారడానికి ముఖ్య కారణం, దీని లక్షణాలు బయటపడకపోవడం. అందుకే పెద్ద పేగు క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్నప్పుడే దీనిని గుర్తించాలంట.

పెద్ద పేగు క్యాన్సర్‌కు కొలొరెక్టల్ క్యాన్సర్ అని కూడా అంటారు. ఇది ఎక్కువగా పెద్ద పేగు, పురీషనాళంలో అభివృద్ధి చెందే ఒకరకమైన క్యాన్సర్, ఇది ఎక్కువగా వృద్ధులలో కనిపిస్తుంది. ముఖ్యంగా 50 సంవత్సరాలు పై బడిన వారిలో ఎక్కువగా దీని ప్రభావం ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది దీని బారిపడుతున్నారు. అయితే దీనికి ముఖ్య కారణం తీసుకుంటున్న ఆహారం , జీవనశైలినే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో పెద్దపేగు క్యాన్సర్స్ విపరీతంగా పెరుగుతున్నాయంట.దాదాపు 3.2 శాతం అధికంగా కేసులు నమోదు అవుతున్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, ఇప్పుడు మనం అసలు పెద్ద పేగు క్యాన్సర్ అంటే ఏంటీ? దీని ప్రారంభ లక్షాలు ఏవో వివరంగా తెలుసుకుందాం.

ఎలాంటి కారణాలు లేకుండా గనుక మీ మలంలో ఎరుపు లేదా, ముదురు రంగులో రక్తం పడితే, తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలని చెబుతున్నారు వైద్య నిపుణులు ఎందుకంటే ఇది పెద్దపేగు క్యాన్సర్ ప్రధాన లక్షణం. అలాగే మల విసర్జనలో మార్పులు. ఎక్కువ సార్లు టాయిలెట్‌కు వెళ్లాల్సిరావడం, పొత్తి కడుపులో నొప్పి ఇవన్నీ పెద్ద పేగు క్యాన్సర్ లక్షణాలేనంట.

ఇవే కాకుండా కొంత మంది ఉన్నట్లుండి ఒక్కసారిగా విపరీతంగా బరువు తగ్గిపోతారు. అలాగే, మలవిసర్జన చేసినా, కడుపు ఖాళీ అయినట్లు అనిపించకపోవడం, తీవ్రంగ, అలసట, నీరసం, ఆకలి తగ్గిపోవడం, ఎంత తిన్నా బక్కగా కనిపించడం, ఇవన్నీ కూడా పెద్ద పేగు క్యాన్సర్ లక్షణాలే, అంటున్నారు ఆరోగ్య నిపుణులు.



