AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భగ్గుమంటున్న ఎండలు.. వర్షాలపై కీలక అప్టేట్ ఇచ్చిన వాతావరణ శాఖ.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. మరోవైపు వర్షాలు, ఈదురుగాలులపై వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి.

భగ్గుమంటున్న ఎండలు.. వర్షాలపై కీలక అప్టేట్ ఇచ్చిన వాతావరణ శాఖ.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
Rain Alert
Shaik Madar Saheb
|

Updated on: May 21, 2026 | 3:45 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 48 డిగ్రీల వరకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా అన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఇలాంటి తరుణంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. రాబోయే 3-4 రోజులలో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. నిన్న తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి ఉత్తర తెలంగాణ వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి ఈరోజు తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి ఝార్ఖండ్ ఉత్తర చత్తీస్గడ్ల మీదుగా అంతర్గత ఒడిస్సా, మీదుగా ఒడిస్సా కోస్తా తీరం వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో కొనసాగుతోంది. ఉపరితల చక్రవాక ఆవర్తనం ఒకటి ఉత్తర ఒడిస్సా తీరం పరిసరాలలో సగటు సముద్రమట్టం నుండి 1.5 కి మీ ఎత్తులో ఈరోజు ఏర్పడింది. ఆగ్నేయ అరేబియన్ సముద్ర ప్రాంతం నుండి మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న ద్రోణి ఈరోజు మధ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతం మీదుగా తమిళనాడు వరకు సగటు సముద్రమట్టం నుండి 3.1 నుండి 4.5 కి మీ ఎత్తులో కొనసాగుతోంది.

తెలంగాణలో రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast) –

గురువారం, శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది.

వాతావరణ హెచ్చరికలు (weather warnings): ఈరోజు రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు, 40 నుండి 50 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని ఉత్తర – తూర్పు జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం : గురువారం, శుక్రవారం, శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది. తీవ్ర వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గరిష్టముగా గంటకు 50-60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- గురువారం, శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. తీవ్ర వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకట లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గరిష్టముగా గంటకు 50-60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

రాయలసీమ :- గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకట లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గరిష్టముగా గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది .

శుక్రవారం, శనివారం ఉరుములతో కూడిన మెరుపులు ఒకట లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గరిష్టముగా గంటకు 50-60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

గమనిక:- రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల 41-44 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యే అవకాశముంది.

Follow Us
వర్షాలపై కీలక అప్టేట్ ఇచ్చిన వాతావరణ శాఖ.. ఇదిగో రిపోర్ట్
వర్షాలపై కీలక అప్టేట్ ఇచ్చిన వాతావరణ శాఖ.. ఇదిగో రిపోర్ట్
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
పూల్వామా దాడి సూత్రధారి హతం..
పూల్వామా దాడి సూత్రధారి హతం..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్