AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు ప్రత్యేక రైళ్లు.. రైల్వేశాఖ నుంచి మరో అప్డేట్..

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళుతున్నారా..? రైళ్లల్లో సీట్లు దొరకడం లేదా..? అయితే మీకు గుడ్ న్యూస్. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను పొడిగించింది. వన్ వే రైళ్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో తిరుపతి వైపు వెళ్లేవారికి ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు ప్రత్యేక రైళ్లు.. రైల్వేశాఖ నుంచి మరో అప్డేట్..
Tirumala
Venkatrao Lella
|

Updated on: May 21, 2026 | 3:35 PM

Share

తిరుపతి వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. వేసవికాలం సెలవులు రావడంతో తిరుమలలో రద్దీ విపరీతంగా పెరిగింది. విద్యాసంస్థలకు సెలవులు రావడంతో పిల్లలతో పాటు తల్లిదండ్రులు పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళుతున్నారు. ఇందులో భాగంగా తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామివారి దర్శనానికి వెళుతున్నారు. ఈ క్రమంలో తిరుపతి వెళ్లే రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసి కనిపిస్తుండగా.. రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను తీసుకొస్తోంది. అందులో భాగంగా తాజాగా వన్ వే ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల కోసం వీటిని అందుబాటులోకి తెచ్చినట్లు స్పష్టం చేసింది.

వన్ వే స్పెషల్ రైళ్లు

నాందేడ్-తిరుపతి(07814) ప్రత్యేక రైలును మే 21వ తేదీన సర్వీసులు అందించనుంది. ఇక తిరుపతి-జల్నా(07815) ప్రత్యేక రైలు మే 22వ తేదీన అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతానికి వన్ వే స్పెషల్ ట్రైన్లుగా వీటిని తిప్పనుండగా.. ఇప్పుడు ఒక్కొక్క సర్వీస్ మాత్రమే పొడిగించారు. ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు, ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ గమ్యస్థానాల మధ్య ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. ఈ రైల్వేకు సంబంధించి టైమ్ షెడ్యూల్, స్టాపులు, ఇతర వివరాలను ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్‌లో చూడవచ్చు. కాగా తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. సమ్మర్ హాలీడేస్ కావడంతో శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి గంటల కొద్ది సమయం పడుతుంది.

ఈ స్టేషన్లలో హాల్టింగ్

నాందేడ్-తిరుపతి(07814) స్పెషల్ ట్రైన్ నాందేడ్ నుంచి బయల్దేరి నిజామాబాద్, వరంగల్ మీదుగా తిరుపతికి వెళుతుంది. ఇక తిరుగు ప్రయాణంలో జల్నాకు బయల్దేరుతుంది. కామారెడ్డి, సికింద్రాబాద్, ఖమ్మం, విజయవాడ, నెల్లూరు స్టేషన్లలో ఇది ఆగనుంది. తెలంగాణ, ఏపీ ప్రాంతాల నుంచి తిరుపతికి వెళ్లే భక్తులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుందని చెప్పవచ్చు.

Follow Us
ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు.. ఈజీగా కమ్మగా ఈ లంచ్ చేసి పెట్టండి
ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు.. ఈజీగా కమ్మగా ఈ లంచ్ చేసి పెట్టండి
సుధీర్ పై సృష్టి చెత్త పని.. చప్పట్లు కొట్టి సంతోషపడిన శకుని..
సుధీర్ పై సృష్టి చెత్త పని.. చప్పట్లు కొట్టి సంతోషపడిన శకుని..
పెళ్లితోనే ఈ రాశుల వారి దశ తిరిగిపోతోంది.. అదృష్టం తలుపు తడుతుంది
పెళ్లితోనే ఈ రాశుల వారి దశ తిరిగిపోతోంది.. అదృష్టం తలుపు తడుతుంది
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు
తగ్గుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..?
తగ్గుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..?
చాలా తక్కువ ధరలో కారు, ఇంటిని శుభ్రం చేసుకోవాలా?
చాలా తక్కువ ధరలో కారు, ఇంటిని శుభ్రం చేసుకోవాలా?
స్టూడెంట్స్, ఉద్యోగులకు బడ్జెట్ ల్యాప్‌టాప్.. ధర ఎంతంటే
స్టూడెంట్స్, ఉద్యోగులకు బడ్జెట్ ల్యాప్‌టాప్.. ధర ఎంతంటే
ఇంట్లోనే డీజే ఫీల్.. Ampnova పార్టీ స్పీకర్
ఇంట్లోనే డీజే ఫీల్.. Ampnova పార్టీ స్పీకర్
కవలలు మేలో పుట్టారు..కానీ బర్త్‌డే జూన్‌లో? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
కవలలు మేలో పుట్టారు..కానీ బర్త్‌డే జూన్‌లో? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్