Skin Care Foods: ఈ ఆహారాలు తింటే సన్ స్క్రీన్ రాసుకున్నట్టే.. ట్యానింగ్ సమస్యే ఉండదు!
చర్మం అందంగా, కాంతి వంతంగా ఉండాలని కోరుకోని వారుండరు. ఆడవారైనా, మగవారికైనా స్కిన్ అందంగా ఉండాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడున్న పొల్యుషన్ వల్ల చర్మం పాడైపోతుంది. దానికి తోడు ఎండ వల్ల త్వరగా ట్యానింగ్ అయిపోతున్నారు. చర్మం కమిలి పోయి.. నల్లగా తయారై నిర్జీవంగా మారుతుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల ఈ ట్యానింగ్ సమస్య నుంచి బయట పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో సన్ స్క్రీన్ లోషన్ రాసుకునే పని ఉండదని..

చర్మం అందంగా, కాంతి వంతంగా ఉండాలని కోరుకోని వారుండరు. ఆడవారైనా, మగవారికైనా స్కిన్ అందంగా ఉండాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడున్న పొల్యుషన్ వల్ల చర్మం పాడైపోతుంది. దానికి తోడు ఎండ వల్ల త్వరగా ట్యానింగ్ అయిపోతున్నారు. చర్మం కమిలి పోయి.. నల్లగా తయారై నిర్జీవంగా మారుతుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల ఈ ట్యానింగ్ సమస్య నుంచి బయట పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో సన్ స్క్రీన్ లోషన్ రాసుకునే పని ఉండదని చెబుతున్నారు. మరి ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి నీళ్లు:
చాలా మంది కేవలం సమ్మర్ లో మాత్రమే కొబ్బరి నీళ్లను తాగుతూ ఉంటారు. కానీ కుదిరినప్పుడల్లా కొబ్బరి నీళ్లు తాగితే.. ఆరోగ్యాని పరంగానే కాకుండా చర్మానికి కూడా పోషణ అందుతుంది. కోకో నెట్ వాటర్ నేచురల్ మాయిశ్చ రైజర్ లా పని చేస్తుంది. తరచూ కొబ్బరి నీళ్లను తాగితే.. స్కిన్ టోన్ కూడా మెరుగు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ఎండ నుంచి కూడా రక్షణగా నిలిచి.. సన్ స్క్రీన్ లా పని చేస్తుంది.
గ్రీన్ టీ:
గ్రీన్ టీతో కూడా చాలా ఆరోగ్య కరమైన ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దీన్ని అతిగా తాగడం కంటే.. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తాగడం ఉత్తమం. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీ ఫెనాళ్లు మెండుగా ఉంటాయి. ఇది సహజ సన్ స్క్రీన్ లా పని చేస్తుంది.
టమాటా:
టమాటాలో లైకోపీన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యూవీయే, యూవీబీ రేడియేషన్ కిరణాల నుంచి స్కిన్ ని కాపాడుతుంది. సన్ బర్న్ కాకుండా చేస్తుంది. అంతే కాకుండా నేచురల్ మాయిశ్చరైజర్ లా కూడా పని చేస్తుంది. టమాటాను తిన్నా.. టమోటా రసం చర్మానికి పూసుకున్నా చాలా మంచిది. స్కిన్ టోన్ కూడా మెరుగు పడుతుంది.
పెరుగు:
పెరుగు తినడం వల్ల ఆరోగ్యమే కాకుండా.. అందాన్ని కూడా పెంపొందించు కోవచ్చు. పెరుగు, మజ్జిగ తీసుకోవడం వల్ల చర్మంపై ముడతలు, గీతలు రాకుండా చూస్తుంది. అంతే కాకుండా వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. పెరుగును కూడా క్రమం తప్పకుండా తీసుకుంటే స్కిన్ టోన్ మెరుగు పడటమే కాకుండా.. చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.