Aadhaar DOB Update:  ఆధార్‌లో పెట్టిన తేదీ ఇలా అప్ డేట్ చేసుకోండి.. ఒక్కసారే అవకాశం!

సాధారణంగా ఆధార్ కార్డులో ఏముంటాయి? వ్యక్తులు పేరు, చిరునామా, పుట్టిన తేదీ ఉంటాయి. అందులో ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే ఏం చేయాలి? ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి, ఓ ఫారం సమర్పించి, దానిని సరిచేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఆన్ లైన్లో ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. ఆధార్ కార్డులో పుట్టిన తేదీని కూడా ఇదే విధంగా మార్చుకోవచ్చు. అయితే ఆధార్ కార్డులో పుట్టిన తేదీని సాధారణంగా ఒక్కసారి మాత్రమే అప్ డేట్ చేసుకొనే వీలుంటుంది.

Aadhaar DOB Update:  ఆధార్‌లో పెట్టిన తేదీ ఇలా అప్ డేట్ చేసుకోండి.. ఒక్కసారే అవకాశం!
Aadhaar Card
Follow us
Madhu

| Edited By: Ravi Kiran

Updated on: Nov 30, 2023 | 7:00 PM

మన దేశంలో ఆధార్ కార్డు ఎంత కీలకమైనదో అందరికీ తెలుసు. కేవలం ఐడెంటిటీ ప్రూఫ్ గా మాత్రమే కాక ప్రతి ప్రభుత్వ పథకానికి ఈ ఇదే ఆధారం. బ్యాంకు ఖాతా ప్రారంభించాలన్నా ఆధార్ ఉండాల్సిందే. మరి అలాంటి ఆధార్ వ్యక్తుల వివరాలు సరిగ్గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఆధార్ కార్డులో ఏముంటాయి? వ్యక్తులు పేరు, చిరునామా, పుట్టిన తేదీ ఉంటాయి. అందులో ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే ఏం చేయాలి? ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి, ఓ ఫారం సమర్పించి, దానిని సరిచేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఆన్ లైన్లో ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. ఆధార్ కార్డులో పుట్టిన తేదీని కూడా ఇదే విధంగా మార్చుకోవచ్చు. అయితే ఆధార్ కార్డులో పుట్టిన తేదీని సాధారణంగా ఒక్కసారి మాత్రమే అప్ డేట్ చేసుకొనే వీలుంటుంది. అప్పటికీ తప్పుగానే ఉంటే ఏం చేయాలి? తెలుసుకుందాం రండి..

ఫోన్ లింక్ తప్పనిసరి..

మీరు మీ ఆధార్ కార్డ్ వివరాలను ఆన్‌లైన్‌లో లేదా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించడం ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడానికి, మీరు మీ ఆధార్ కార్డ్‌కి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను లింక్ చేసి ఉండాలి. ఆ తర్వాత మీరు యూఐడీఏఐ వెబ్‌సైట్‌ని సందర్శించి, మీ వివరాలను అప్‌డేట్ చేయడానికి అక్కడ ఇచ్చే సూచనలను అనుసరించవచ్చు. మీ ఆధార్ కార్డ్‌ని అప్‌డేట్ చేయడం వల్ల మీ కార్డ్‌లోని సమాచారం కచ్చితమైనది, తాజాది అని నిర్ధారిస్తుంది.

ఆధార్ కార్డులో పుట్టిన తేదీ అప్‌డేట్..

మీరు ఆధార్ కార్డులో పుట్టిన తేదీ అప్ డేట్ చేయాలంటే అందుకు తగిన, చెల్లుబాటు అయ్యే డేట్ ఆఫ్ బర్త్ రుజువుతో ఆధార్‌ అప్‌డేట్ చేయవచ్చు. అయితే సాధారణంగా పుట్టిన తేదీని ఒకసారి మాత్రమే అప్ డేట్ చేసుకొనే వీలుంటుంది. ఇప్పటికే ఒకసారి చేసి ఉంటే అది ఇక మారదు. ఒకవేళ మీ కార్డులో అప్పటికీ తప్పుగా డేట్ ఆఫ్ బర్త్ నమోదై ఉంటే? ఏం చేయాలి? దానికీ ఓ మార్గం ఉంది. ఏదేంటో చూద్దాం రండి..

ఇవి కూడా చదవండి

రెండో సారి పుట్టిన తేదీ అప్ డేట్ ఇలా..

  • మీరు మీ ఆధార్‌లోని డేట్ ఆఫ్ బర్త్ ని ఒక్కసారి మాత్రమే అప్‌డేట్ చేయవచ్చు. ఒకవేళ మీరు మళ్లీ దానిని అప్‌డేట్ చేయాల్సిన అవసరం ఉన్నట్లయితే, మీరు ఈ విధంగా చేయండి..
  • https://uidai.gov.in/images/commdoc/valid_documents_list.pdfలో అందుబాటులో ఉన్న ఈ జాబితా ప్రకారం మీ పేరులో చెల్లుబాటు అయ్యే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌తో ఏదైనా ఆధార్ కేంద్రాన్ని సందర్శించండి.
  • ఈ అభ్యర్థన తిరస్కరించబడితే, 1947కు కాల్ చేయండి లేదా help@uidai.gov.inకి రాయండి. మీ తాజా అప్‌డేట్ అభ్యర్థన నంబర్, సంప్రదింపు వివరాలను భాగస్వామ్యం చేయడం ద్వారా ‘ఎక్స్ సెప్షన్ అప్డేట్’ కోసం అభ్యర్థించండి.

ఇటీవల డేట్ ఆఫ్ బర్త్ అప్ డేట్ అయ్యిందని మీ దరఖాస్తు రిజెక్ట్ అయితే.. ఇప్పుడు ఏమి చెయ్యాలి?

  • మీరు మొదటిసారిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ని అప్‌డేట్ చేస్తుంటే, 1947కు కాల్ చేయడం ద్వారా మీ అభ్యర్థన తిరస్కరణకు కారణాన్ని తనిఖీ చేసి, తదనుగుణంగా దిద్దుబాటు చర్య తీసుకోవచ్చు.

గుర్తుంచుకోండి.. మీరు మీ ఆధార్ కార్డ్‌లో పుట్టిన తేదీని ఒకసారి మాత్రమే సరిచేయగలరు. మీరు దాన్ని మళ్లీ సరిచేయవలసి వస్తే, మీరు ఎక్స్ సెప్షన్ అప్ డేట్ ప్రక్రియను అనుసరించాలి. చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్ రుజువుతో పాటు యూఐడీఏఐకి అభ్యర్థనను సమర్పించడం ఈ ప్రక్రియలో ఉంటుంది. యూఐడీఏఐ మీ అభ్యర్థనను సమీక్షించి, దానిని ఆమోదించాలా వద్దా అని నిర్ణయిస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే