- Telugu News Photo Gallery Technology photos Noise launching new smart watch Noise colorfit pro 5, pro max, Check here for features and price details
Smart watch: నాయిస్ నుంచి మరో స్టన్నింగ్ స్మార్ట్ వాచ్.. అధునాతన డిస్‌ప్లేతో పాటు..
ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ వాచ్‌ల హవా నడుస్తోంది. మార్కెట్లోకి అధునాతన ఫీచర్లతో కూడిన వాచ్‌లను లాంచ్ చేస్తున్నారు. ఇక కొన్ని కంపెనీలు తక్కువ ధరకే మంచి ఫీచర్లతో కూడిన స్మార్ట్ వాచ్‌లను తీసుకొస్తున్నారు. తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ నాయిస్.. మార్కెట్లోకి కొత్త వాచ్‌ను లాంచ్ చేసింది. నాయిస్ కలర్ ఫిట్ ప్రో 5 సిరీస్ పేరుతో రెండు వేరియంట్స్‌ను భారత్‌లో లాంచ్ చేశారు. ఇంతకీ ఈ వాచ్‌లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి వివరాలు..
Updated on: Nov 29, 2023 | 11:58 PM

భారత్‌కు చెందిన ప్రముఖ గ్యాడ్జెట్ తయారీ సంస్థ నాయిస్ మార్కెట్లోకి కొత్త వాచ్‌ను లాంచ్ చేసింది. కలర్ ఫిట్ ప్రో 5 సిరీస్‌లో భాగంగా.. ప్రో 5, ప్రో 5 మ్యాక్స్ పేరుతో రెండు మోడల్స్‌ను లాంచ్ చేసింది.

ఈ రెండు ఫోన్‌లలో ఎస్‌ఓఎస్ కనెక్టివిటీతో పాటు పలు స్పోర్ట్స్ మోడ్‌లను సైతం అందించారు. ధర విషయానికొస్తే కలర్ ఫిట్ ప్రో 5 ధర రూ. 3,999గా ఉండగా ప్రో 5 మ్యాక్స్ ధరను రూ. 4,999గా నిర్ణయించారు.

ఇక ఈ స్మార్ట్ వాచ్‌ల ఫీచర్ల విషయానికొస్తే.. కలర్ ఫిట్ ప్రో 5లో 1.85 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 390 x 450 రిజల్యూషన్ ఈ స్క్రీన్ ప్రత్యేకత. స్మార్ట్ ఫోన్స్‌లో ఉండే ఇలాంటి డిస్‌ప్లేను వాచ్‌లో అందించారు.

ప్రో 5 మ్యాక్స్‌లో 1.96 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 410 x 502 రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం. ధర విషయానికొస్తే దీని ధర రూ.4,999గా ఉంది. జెట్ బ్లాక్, స్పేస్ బ్లూ, క్లాసిక్ బ్లాక్, క్లాసిక్ బ్రౌన్, ఎలైట్ బ్లాక్, ఎలైట్ సిల్వర్ వంటి కలర్స్‌లో అందుబాటులో ఉంది.

ఈ రెండు స్మార్ట్ వాచ్‌ల్లోనూ హార్ట్ రేట్, ఎస్‌పీఓ2, స్లీప్ ట్రాకింగ్, స్ట్రెస్ ట్రాకింగ్ వంటి హెల్త్ ఫీచర్లను అందించారు. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ ఈ వాచ్ సొంతం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏడు రోజుల పాటు పనిచేస్తుంది. దుమ్ము, నీటి నిరోధకత కోసం IP68 రేటింగ్‌ని రెండు వాచ్‌లలో అందించారు.





























