Redmi 13c: రెడ్‌మీ నుంచి బడ్జెట్‌ ఫోన్‌.. ఏఐ కెమెరా ఈ ఫోన్‌ సొంతం.

ప్రస్తుతం మార్కెట్లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. తక్కువ ధరలోనే మంచి క్వాలిటీ ఉన్న ఫోన్‌లను మార్కెట్లోకి లాంచ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజ సంస్థ రెడ్‌మీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. రెడ్‌మీ 13సీ పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకురానున్నారు. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్స్‌తో తీసుకురానున్న ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla

|

Updated on: Nov 29, 2023 | 10:51 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజ సంస్థ రెడ్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. రెడ్‌మీ 13సీ పేరుతో తీసుకురానున్న ఈ ఫోన్‌ను డిసెంబర్‌ 6వ తేదీన మార్కెట్లోకి తీసుకురానున్నారు.

1 / 5
ఇక రెడ్‌మీ 13 సీ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 50 మగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను ఇవ్వనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన కెమెరా దీని ప్రత్యేకతగా చెప్పొచ్చు.

2 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌ను స్టార్‌డ‌స్ట్ బ్లాక్‌, స్టార్‌షైన్ గ్రీన్ క‌ల‌ర్స్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ట్రిపుల్ రియ‌ర్ కెమెరా సెట‌ప్‌తో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇక ఈ ఫోన్ బేస్‌ వేరియంట్‌ ధర రూ. 9,500గా ఉండొచ్చని అంచనా.

3 / 5
రెడ్‌మీ 12సీకి కొనసాగింపుగా తీసుకురానున్న ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్‌ హీలియో జీ99 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. 18 వాట్స్‌ వైర్డ్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం.

4 / 5
ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.74 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేయనుంది.

5 / 5
Follow us