OLA: ఓలా యాప్‌లో కొత్త ఫీచర్.. ఇకపై పేమెంట్స్ కూడా చేసుకునే ఛాన్స్
ఐసీసీఐ, ఎస్‌బీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ ఇలా అన్ని బ్యాంకులు యూపీఐ సేవలను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ క్యాబ్ బుకింగ్ సేవల సంస్థ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. తమ యూజర్ల కోసం ఈ ఫీచర్‌ను జోడించారు. ఇకపై ఓలా యూజర్లు నేరుగా తమ యాప్‌లోనే డిజిటల్ పేమెట్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఈ విషయాన్ని కో ఫౌండర్ సీఈఓ భవీశ్ అగర్వాల్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు...

ప్రస్తుతం యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) సేవలు బాగా విస్తరిస్తున్నాయి. చాయ్ బండి మొదలు పెద్ద పెద్ద షోరూమ్‌ల వరకు యూపీఐ పేమెంట్స్‌ను యాక్సెప్ట్ చేస్తున్నాయి. దీంతో మార్కెట్లోకి ఎన్నో రకాల యూపీఐ పేమెంట్ సర్వీసెస్ అందుబాటులోకి వచ్చాయి. ఫోన్‌పే, జీపే, పేటీఎమ్ వంటి ప్రముఖ యాప్స్‌తో పాటు అన్ని రకాల బ్యాంకులు సైతం సొంతంగా తమ ప్లాట్ ఫామ్ నుంచి యూపీఐ సేవలను అందిస్తున్నాయి.
ఐసీసీఐ, ఎస్‌బీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ ఇలా అన్ని బ్యాంకులు యూపీఐ సేవలను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ క్యాబ్ బుకింగ్ సేవల సంస్థ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. తమ యూజర్ల కోసం ఈ ఫీచర్‌ను జోడించారు. ఇకపై ఓలా యూజర్లు నేరుగా తమ యాప్‌లోనే డిజిటల్ పేమెట్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఈ విషయాన్ని కో ఫౌండర్ సీఈఓ భవీశ్ అగర్వాల్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీంతో ఇకపై ఓలా యూజర్లు నేరుగా తమ యాప్ నుంచే పేమెంట్స్ చేసుకోవచ్చు.
సాధారణంగా ఓలా నుంచి క్యాబ్ చేసుకుంటే.. పేమెంట్ మోడ్‌లోకి వెళ్లి, మనీ వ్యాలెట్ లేదా క్యాష్ ద్వారా పేమెంట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ డిజిటల్ పేమెంట్ చేయాలంటే.. ఇతర యూపీఐ సేవల ద్వారా చేసుకోవాల్సి ఉండేది. అయితే ఇకపై థార్డ్ పార్టీ యూపీఐ యాప్ అవసరం లేకుండానే ఓలా యాప్ ద్వారానే పేమెంట్ చేసుకోవచ్చు. దీంతో ఇప్పటి వరకు బుకింగ్ మాత్రమే పరిమితమైన ఓలా యాప్ ద్వారా ఇకపై పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు.
ఇందులో భాగంగానే ఓలా యాప్‌లో యూపీఐ పేమెంట్స్ ఫీచర్‌ను జోడించారు. దీంతో యాప్ ద్వారా నేరుగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు చెల్లించవచ్చని కంపెనీ చెబుతోంది. ఓలా తొలుత ఈ ఫీచర్‌ను బెంగళూరు వాసులకు అందుబాటులోకి తీసుకురానుంది. అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న యూజర్లలందరికీ సేవలను విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..