AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munna: నరహంతకుడి ముఠాలో ప్రధాన నిందితుడు మున్నా నేర చరిత్ర .. పోలీసు రికార్డులు ఏం చెబుతున్నాయంటే..!

Munna Gang Case: హైవే కిల్లర్‌ మున్నా గ్యాంగ్‌ కేసులో ఈనెల24న ఒంగోలు జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. 12 మందికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు.

Munna: నరహంతకుడి ముఠాలో ప్రధాన నిందితుడు మున్నా నేర చరిత్ర .. పోలీసు రికార్డులు ఏం చెబుతున్నాయంటే..!
Subhash Goud
|

Updated on: May 27, 2021 | 6:55 AM

Share

Munna Gang Case: హైవే కిల్లర్‌ మున్నా గ్యాంగ్‌ కేసులో ఈనెల24న ఒంగోలు జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. 12 మందికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు మున్నాతో పాటు 11 మందికి ఉరిశిక్ష విధించింది. 13 ఏళ్ల కిందట హైవేపై లారీ డ్రైవర్లు, క్లీనర్లను మున్నా గ్యాంగ్‌ హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. 13 ఏళ్ల పాటు సాగిన ఈ కేసు విచారణలో ఎట్టకేలకు కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితుడు లారీ డ్రైవర్‌, క్లీనర్‌లను దారుణంగా హత్య చేశారని తేలడంతో ప్రధాన నిందితుడు మున్నాతో పాటు మరో 11 మందికి న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. వీరిలో ముగ్గురిని రెండుసార్లు ఉరి తీయాలని న్యాయమూర్తి పేర్కొన్నారు.

2008లో లారీ డ్రైవర్లు, క్లీనర్లను దారుణంగా హతమార్చి వాగు వద్ద హైవే కిల్లర్‌ మున్నా గ్యాంగ్‌ పూడ్చి పెట్టిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. దీనికి సంబంధించి 4 కేసుల్లో 18 మందిపై నేరం రుజువైంది. పశ్చిమ బెంగాల్‌ దుర్గాపూర్‌ నుంచి ఇనుప రాడ్ల లోడ్‌తో తమిళనాడులోని కల్పకంకు బయలుదేరిన లారీతోపాటు డ్రైవర్, క్లీనర్‌ అదృశ్యమయ్యారు. దీంతో 2008 అక్టోబర్‌ 17న లారీ యజమాని వీరప్పన్‌ కుప్పుస్వామి ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పాత ఇనుము వ్యాపారులపై ప్రత్యేక నిఘా పెట్టారు. సయ్యద్‌ అబ్దుల్‌ సమద్‌ అలియాస్‌ మున్నా కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 20కి పైగా సిమ్‌ కార్డులు మార్చి దేశం వదిలి పారిపోయేందుకు ప్రయత్నించిన మున్నాను కర్ణాటకలోని అరెస్ట్ చేశారు. ఎట్టకేలకు నిందితులకు ఉరి శిక్ష విధిస్తు ఒంగోలు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

అయితే ఈ నరహంతకుడి ముఠాలో ప్రధాన నిందితుడు అబ్దుల్‌ సమద్‌ అలియాస్‌ మున్నా నేర చరిత్ర విజయవాడలోనే మొదలైనట్లు పోలీసు రికార్డులు చెబుతన్నాయి. 17 సంవత్సరాల కిందట కడప జిల్లా రాజంపేట సమీపంలోని చిట్వేలిలో విస్తరించిన నల్లమల అడవుల్లో గుప్త నిధులున్నాయని నిందితుడు మున్నా కొంతమందిని నమ్మించి, వాటిని వెలికి తీస్తామని నమ్మబలికి అనేక మంది వద్ద నుంచి దాదాపు రూ.11 లక్షల వరకు మున్నా గ్యాంగ్‌ వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే మున్నా చేతిలో మోసపోయిన రవికుమార్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధురానగర్‌లోని ఓ ఇంట్లో ఉన్న మున్నా, అతని నలుగురు అనుచరులను సత్యనారాయణపురం పోలీసులు పట్టుకున్నారు. అలాగే అప్పట్లో మున్నా వద్ద మూడు రివాల్వర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు అనంతరం మున్నా అతని ముఠాతో సహా మకాంను విజయవాడ నుంచి గుంటూరుకు మార్చాడు. అక్కడ కూడా నల్లమల అడవుల్లో బంగారం తవ్వకాలు చెబుతూ కొందర్ని మోసం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఒంగోలుకు మకాం మార్చిన మున్నా .. జిల్లాలో పోలీసులమని చెప్పి హైవేపై ఇనుముతో వెళుతున్న భారీ లారీలను ఆపి డ్రైవర్, క్లీనర్‌ను దారుణంగా హత్య చేసేవారు. 2008లో నమోదైన ఆ కేసుల్లో.. ఒంగోలు 8వ అదనపు జిల్లా జడ్జి టి.మనోహర్‌రెడ్డి మున్నాతో పాటు మరో 11 మందికి ఉరిశిక్ష వేసిన సంగతి తెలిసిందే.

ఇవీ కూడా చదవండి:

Mahabubnagar: మహబూబ్‌నగర్‌ జిల్లాలో విషాదం.. దేవరకద్ర సమీపంలోని గుట్టపై మూడు మృతదేహాలు

Boat Accident: ఘోర ప్రమాదం.. పడవ మునిగి నలుగురు మృతి.. 156 మంది గల్లంతు.. సహాయక చర్యలు ముమ్మరం