Simhachalam Substation Fire: సింహాచలం ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. సకాలంలో మంటలు అదుపు చేసిన ఫైర్ సిబ్బంది

విశాఖలో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సింహాచలం, ఆర్.ఆర్.వెంకటాపురం ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్‌లో మంటలు చెలరేగాయి.

Simhachalam Substation Fire: సింహాచలం ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. సకాలంలో మంటలు అదుపు చేసిన ఫైర్ సిబ్బంది
Fire Accident In Electricity Substation In Simhachelam
Follow us
Balaraju Goud

|

Updated on: May 27, 2021 | 7:07 AM

AP Electricity Substation fire accident: విశాఖలో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సింహాచలం, ఆర్.ఆర్.వెంకటాపురం ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్‌లో మంటలు చెలరేగాయి. గురువారం తెల్లవారుజామున సబ్‌స్టేషన్‌లోని ట్రాన్స్‌ఫార్మర్లు ఒక్కసారిగా పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. భారీ శబ్ధాలతో ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోయాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ ఏర్పడింది. దీంతో రాత్రిపూట విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మూడు ఫైరింజన్లు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అధిక ఉష్ణోగ్రతల వల్లే సబ్‌స్టేషన్‌లో మంటలు చెలరేగాయని ట్రాన్స్‌కో డీఈ చెప్పారు. ప్రస్తుతం విద్యుత్‌ను పునరుద్దరించినట్లు తెలిపారు. ఈ ఘటనలో భారీగా అస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Read Also….

Viral Video: మిలీనియర్ ని చేసిన చెత్తబుట్టలోని లాటరీ టికెట్…అసలేం జరిగిందంటే..?? ( వీడియో )

Munna: నరహంతకుడి ముఠాలో ప్రధాన నిందితుడు మున్నా నేర చరిత్ర .. పోలీసు రికార్డులు ఏం చెబుతున్నాయంటే..!

Vijayawada: బెజవాడ ‘కిలాడీ లేడీ’ అరెస్ట్.. ప్రభుత్వ ఉద్యోగాల పేరిట ఎన్నో మోసాలు..