ఇదేం ఘోరం.. వృద్ధ మహిళకు సీపీఆర్ చేస్తుండగా.. విరిగిన పక్కటెముకలు..!
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అనూహ్య ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కాన్పూర్‌లో ఒక వృద్ధ మహిళ కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) పొందుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వృద్ధురాలి ఛాతీపై CPR ఇస్తున్నప్పుడు ఆమె పక్కటెముకలు అకస్మాత్తుగా విరిగిపోయాయి. ఆ తర్వాత ఆమె పరిస్థితి మరింత క్షిణించింది.

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అనూహ్య ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కాన్పూర్‌లో ఒక వృద్ధ మహిళ కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) పొందుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వృద్ధురాలి ఛాతీపై CPR ఇస్తున్నప్పుడు ఆమె పక్కటెముకలు అకస్మాత్తుగా విరిగిపోయాయి. ఆ తర్వాత ఆమె పరిస్థితి మరింత క్షిణించింది. ఆమెను వెంటనే అక్కడి నుంచి కార్డియాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. కానీ వైద్యులు ఆమె అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. దీంతో CPR సమయంలో ప్రైవేట్ నర్సింగ్ హోమ్ నిర్లక్ష్యం వహించిందని ఆ మహిళ కుటుంబం ఆరోపించింది.
కన్నౌజ్‌లోని గుర్సహైగంజ్ ప్రాంతంలో నివసిస్తున్న 59 ఏళ్ల సుధా దూబే సోమవారం (నవంబర్ 24) అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమెను కాన్పూర్‌లోని కళ్యాణ్‌పూర్ కైలాష్ విహార్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌కు తరలించారు. అక్కడ ఆమెను చేర్చుకుని చికిత్స మొదలు పెట్టారు. మంగళవారం ఉదయం, సుధ పరిస్థితి మరింత దిగజారింది. ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ప్రారంభమైనప్పుడు, నర్సింగ్ హోమ్‌లో వైద్య సిబ్బంది CPR ఇవ్వడం మొదలుపెట్టారు. తరువాత ఆమె పరిస్థితి మరింత క్షిణించింది. ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది.
నర్సింగ్ హోమ్ సిబ్బంది సుధను కార్డియాలజీ ఇన్స్టిట్యూట్ కు రిఫర్ చేశారు. అక్కడి నుండి ఆమె కుటుంబ సభ్యులు ఆమెను అంబులెన్స్ లో కార్డియాలజీ ఇన్స్టిట్యూట్ కు మధ్యాహ్నం 1:45 గంటల ప్రాంతంలో తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించిన తర్వాత ఆమె మరణించినట్లు ప్రకటించారు. అంతేకాదు ఆమెకు పక్కటెముకలు విరిగినట్లు నిర్ధారించారు. ఇది విన్న కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
మరణించిన సుధా దూబే కుమార్తె పూజ, కుమారుడు సుర్జీత్ నర్సింగ్ హోమ్ సిబ్బంది ఒకరు ఆమెకు ఛాతీపై CPR చేశారని ఆరోపించారు. ఈ చర్య వల్ల వారి తల్లి పక్కటెముకలు విరిగి ఆమె మరణించిందని ఆరోపించారు. నర్సింగ్ హోమ్ ఇప్పటికే పత్రాలపై తమ సంతకాలను పొందిందని, ఎటువంటి చికిత్స అందించకుండానే 21,000 రూపాయల డిపాజిట్ కూడా వసూలు చేసిందని వారు పేర్కొన్నారు. మరణం తరువాత, కుటుంబం మృతదేహంతో కన్నౌజ్‌కు తిరిగి వచ్చింది. ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
