AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Property Astrology: ఆ రాశుల వారికి వారసత్వ సంపద ఖాయం! ఇందులో మీ రాశి ఉందా?

జాతక చక్రంలో గానీ, గోచారంలో గానీ తొమ్మిదవ స్థానాధిపతి బలంగా, అనుకూలంగా ఉన్న పక్షంలో ఆ రాశుల వారికి తప్పకుండా వారసత్వ సంపద లభిస్తుంది. తల్లితండ్రుల ఆస్తి సంక్రమించడం, అన్నదమ్ములతో ఆస్తిపాస్తులకు సంబంధించిన వివాదాలు అనుకూలంగా పరిష్కారం కావడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ప్రస్తుతం గ్రహ సంచారాన్ని బట్టి వృషభం, కర్కాటకం, సింహం, తుల, మకరం, మీన రాశుల వారికి జనవరి లోపు వారసత్వ సంపద, ఆస్తి పాస్తులు లభించే అవకాశం ఉంది. ఆస్తిపాస్తులు, వారసత్వ సంపదకు సంబంధించిన సమస్యలు లేదా వివాదాలు ఉన్నవారు కాలభైరవాష్టకం పఠించడం వల్ల ఇటువంటివి పూర్తిగా పరిష్కారమవుతాయి.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 26, 2025 | 5:02 PM

Share
వృషభం: తొమ్మిదవ స్థానాధిపతి శనీశ్వరుడు ప్రస్తుతం లాభ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి సమీప భవిష్యత్తులో తప్పకుండా పూర్వీకుల ఆస్తిపాస్తులు లభించే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై, ఆస్తి లాభం, భూలాభం కలిగే అవకాశం ఉంది. పిత్రార్జితం కూడా లభించడం జరుగుతుంది. సాధారణంగా పెద్దల వైపు నుంచి దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు, రుణ సమస్యలు ఉండే అవకాశం లేదు. తండ్రి కారణంగా గృహ యోగం కూడా పడుతుంది.

1 / 6
కర్కాటకం: తొమ్మిదవ స్థానాధిపతి గురువు ప్రస్తుతం ఇదే రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు, వస్త్రాభరణాలు కలిసి రావడానికి డిసెంబర్ 5 లోపు మార్గం సుగమం అవుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు కూడా సానుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. వీరికి అనేక విధాలుగా పితృభాగ్యం కలుగుతుంది. తండ్రి కారణంగా సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం కావడం, తండ్రికి చెందిన వ్యాపారం కూడా చేతికి రావడం జరుగుతుంది.

2 / 6
సింహం: సాధారణంగా ఈ రాశివారి జీవితంలో తండ్రి కీలక పాత్ర పోషించడం, వీరి మీద తండ్రి ప్రభావం ఉండడం జరుగుతుంటుంది. రాశ్యధిపతి రవి పితృకారకుడైనందువల్ల వీరికి తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు లభించడం, సహాయ సహకారాలు అందడం సహజమైన విషయంగా ఉంటుంది. ఈ రాశికి తొమ్మిదవ స్థానాధిపతి కుజుడు ప్రస్తుతం రాశ్యదిపతి రవితో చతుర్థ స్థానంలో కలిసి ఉన్నందువల్ల వీరికి తండ్రి వైపు నుంచి భూ లాభం కలగడంతో పాటు, గృహ యోగం కూడా కలుగుతుంది.

3 / 6
తుల: ఈ రాశికి తొమ్మిదవ స్థానాధిపతి బుధుడు ప్రస్తుతం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ ఏడాది ముగిసేలోగా ఈ రాశివారికి పిత్రార్జితం లభించే అవకాశం ఉంది. తల్లితండ్రుల వైపు నుంచి ఆస్తిపాస్తులు లభించడంతో పాటు, తండ్రికి చెందిన వృత్తిని గానీ, వ్యాపారాన్ని గానీ చేపట్టే అవకాశం కూడా ఉంది. తండ్రి వల్ల ఆదాయం వృద్ధి చెందడంతో పాటు కుటుంబానికి కూడా అనేక విధాలుగా మేలు కలుగుతుంది. ఈ రాశివారికి జీవితాంతం తల్లితండుల అండదండలు లభిస్తాయి.

4 / 6
మకరం: తొమ్మిదవ స్థానాధిపతి బుధుడు ప్రస్తుతం దశమ, లాభ స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారి ఆర్థికాభివృద్ధిలో తండ్రి కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. తండ్రికి సంబంధించిన భూములు, ఇల్లు, ఇతర ఆస్తిపాస్తులతో పాటు పూర్వీకుల ఆస్తి కూడా ఈ రాశివారికి జనవరి లోపు సంక్రమించే అవకాశం ఉంది. భారీ స్థాయిలో పిత్రార్జితం లభిస్తుంది. అనేక విధాలుగా పితృ భాగ్యం కలుగుతుంది. తండ్రికి సంబంధించిన షేర్లు, వృత్తి, వ్యాపారాలు కూడా వీరికి లభిస్తాయి.

5 / 6
మీనం: ఈ రాశికి తొమ్మిదవ స్థానాధిపతి అయిన కుజుడు ప్రస్తుతం తొమ్మిదవ స్థానంలోనే సంచారం చేస్తున్నందువల్ల జనవరిలోపు ఈ రాశివారికి తండ్రి వైపు నుంచి స్థలాలు, పొలాలు లభించే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు తండ్రి కారణంగా సానుకూలంగా పరిష్కారమవుతాయి. పిత్రార్జితం లభిస్తుంది. తండ్రి సహాయంతో గృహ యోగం కూడా పడుతుంది. ఈ రాశివారి సంపద వృద్ధిలో తండ్రి కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. వీరి మీద తండ్రి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

6 / 6