AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wealth Astrology: కీలక గ్రహాల అనుకూలత.. మరో 100 రోజులు వారు రారాజులు!

Telugu Astrology: రాశ్యధిపతులతో పాటు, మూడు శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని రాశుల వారికి మరో వంద రోజుల పాటు జీవితం విజయాలు, సాఫల్యాలతో సాగిపోవడం జరుగుతుంది. ఈ రాశుల ప్రధాన లక్షణాలకు తగ్గట్టుగా ఈ రాశులవారి కోరికలు, ఆశలు, ఆశయాలు నెరవేరి వీరు ఒక వెలుగు వెలగబోతున్నారు. మేషం, సింహం, తుల, వృశ్చికం, ధనూ రాశుల వారికి అనేక విధాలుగా ధన యోగాలు, రాజయోగాలు పట్టబోతున్నాయి. ఈ రాశుల వారు ఎంత ప్రయత్నిస్తే అంతగా శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు వీరికి ఏ విషయంలోనూ తిరుగుండకపోవచ్చు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 26, 2025 | 4:48 PM

Share
మేషం: రాశ్యధిపతి కుజుడు త్వరలో భాగ్య, దశమ స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారి లక్షణాలు, ఆశయాలకు తగ్గట్టు అధికార యోగం కలిగే అవకాశం ఉంది. ఒక సంస్థకు అధిపతి కావాలన్న వీరి ఆకాంక్ష తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. ఒక సంపన్నుడుగా, ఒక ప్రముఖుడుగా గుర్తింపు తెచ్చుకోవడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లడం, విదేశీ సంపాదన ఆర్జించే అవకాశం కూడా ఉంది. అవివాహితులకు విదేశీ సంబంధం ఖాయం అవుతుంది.

1 / 5
సింహం: ఈ రాశివారికి మరో మూడు నెలల పాటు రాశ్యధిపతి రవి 4, 5, 6 స్థానాల్లో అనుకూల సంచారం చేస్తున్నందువల్ల అధికారం కోసం ఈ రాశివారు పడే తాపత్రయం తప్పకుండా నెరవేరుతుంది. సొంతగా వ్యాపారాలు ప్రారంభించి ఆశించిన స్థాయిలో లాభాలు గడించే అవకాశం ఉంది. ఉద్యోగిగా కాక, యజమానిగా ఉండాలన్న వీరి ఆశయం ఈ వంద రోజుల్లో ఆశించిన విధంగా నెరవేరుతుంది. సొంత ఇల్లు, సొంత వాహనం కలుగుతాయి. సంపన్నుడి స్థాయికి ఎదగడం జరుగుతుంది.

2 / 5
తుల: రాశ్యధిపతి శుక్రుడు అనుకూల సంచారం చేయడంతో పాటు శుభ గ్రహాలు, పాప గ్రహాలు కూడా అనుగ్రహించే అవకాశం ఉన్నందువల్ల ఈ రాశివారి మనసులోని కోరికలు చాలావరకు నెరవేరు తాయి. సొంతగా వ్యాపారంచేయాలన్న వీరి మనసులోని ప్రధానమైన కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అతి తక్కువ కాలంలో, అతి తక్కువ శ్రమతో ఈ రాశివారు సంపన్నులయ్యే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల ద్వారా కూడా ఆదాయం పెంచుకోవడం జరుగుతుంది.

3 / 5
వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు మూడు నెలల పాటు స్వస్థానంలో, మిత్ర క్షేత్రంలో, ఉచ్ఛ స్థితిలో సంచారం చేయబోతున్నందువల్ల ఈ రాశివారు తాము కోరుకున్న రంగంలో తప్పకుండా ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. అధికార స్థానాల్లో ఉండాలన్న ఈ రాశివారి కోరిక సమీప భవిష్యత్తులో నెరవేరుతుంది. ఒక సంస్థకు అధిపతి కావడం గానీ, సొంతగా ఒక సంస్థను నెలకొల్పడం గానీ జరుగుతుంది. శ్రమాధిక్యతను లెక్క చేయకుండా కృషి చేసి సంపన్నుడు కావడం జరుగుతుంది.

4 / 5
ధనుస్సు: సొంతగా వ్యాపారం ప్రారంభించాలన్న వీరి చిరకాల కోరిక నెరవేరే అవకాశం ఉంది. రాశ్యధిపతి గురువు సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల వీరి మనసులోని కోరికలు, ఆశయాలు చాలా వరకు నెరవేరడం జరుగుతుంది. ఇప్పటికే వ్యాపారాల్లో ఉన్నవారు తమ వృత్తి, వ్యాపారాలను విస్తరించడానికి అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో ఉద్యోగంలో అగ్ర స్థానానికి చేరుకుంటారు. అధికార యోగం పడుతుంది. అనేక విధాలైన ఆదాయ మార్గాలతో వీరు సంపన్నుడుగా ఎదుగుతారు.

5 / 5