Flour Storing Tips: ఇంట్లో నిల్వచేసిన పిండికి పురుగులు పడుతున్నాయా? ఇలా చేయండి..!
ప్రతి ఇంట్లో చపాతీ, రోటీ ఖచ్చితంగా తయారు చేస్తారు. వంటగదిలో చపాతీ పిండి గానీ, మరో పిండి ఖచ్చితంగా ఉంటుంది. అయితే, కొన్నిసార్లు పిండిని ఎక్కువరోజులు స్టోరేజీ ఉంచితే, ఆ పిండికి పురుగులు పడతాయి. దాంతో ఆ పిండిని వినియోగించడానికి భయపడిపోతాం. మరి ఎక్కువ కాలం నిల్వ చేసిన పిండికి పురుగులు పట్టుకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పిండిలో కాస్త ఉప్పు కలపాలి..
పిండిలో కొద్దిగా ఉప్పు వేయాలి. పిండిలో ఉప్పు ఉంటే పురుగులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. పిండి పరిమాణం ప్రకారం ఉప్పు ఒకటి లేదా రెండు స్పూన్లు కలపాలి. ఆ పిండిని ఒక బాక్స్‌లో వేసి ఉంచాలి. అలా చేస్తే పిండి చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది.

పిండిలో బే ఆకులను వేయొచ్చు..
పిండిలో ఉప్పు వేయకూడదనుకుంటే.. దానికి బదులుగా బే ఆకులను కూడా ఉపయోగించవచ్చు. బే ఆకుల వాసన వల్ల క్రిములు రావు. బే ఆకుల వాసన చాలా ఘాటుగా ఉంటుంది. తద్వారా కీటకాలు రాక, పిండి ఎక్కువ కాలం స్వచ్ఛంగా ఉంటుంది.
ఫ్రిజ్‌లో కూడా పెట్టవచ్చు..
పిండి తక్కువగా ఉంటే దానిని ఫ్రిజ్‌లో కూడా నిల్వ చేయవచ్చు. పిండిని ఎక్కువ కాలం తాజాగా ఉంచాలనుకుంటే ఫ్రిజ్ బెటర్ ఆప్షన్. అయితే, గాలి చొరబడని ప్లాస్టిక్ సంచిలో పిండిని ఉంచి, ఆపై ఫ్రిజ్లో ఉంచాలి. ఫ్రిజ్‌లో ఉంచేటప్పుడు, తేమ దానిలోకి రాకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే అది చెడిపోవచ్చు.
పిండిని కొనుగోలు చేసేటప్పుడు గడువు తేదీని చెక్ చేయాలి..
పిండిని పెద్దమొత్తంలో కొనుగోలు చేసే ముందుగా దాని నాణ్యతను చెక్ చేయడం చాలా ముఖ్యం. అంతేకాదు.. గడువు తేదీని కూడా చెక్ చేయాలి. పిండి పాతదైతే, దానిని ఇంట్లో ఎక్కువ కాలం నిల్వ ఉంచితే పురుగులు పట్టే ఛాన్స్ ఉంది. అందుకే నెల రోజులు దాటిన పిండి ప్యాకెట్లను కొనకూడదు. అలా కాకుండా, గోధుమలను పట్టించి, పిండిని ఉపయోగిస్తే చాలాకాలం పిండి స్వచ్ఛంగా ఉంటుంది.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..