AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brass Copper: పూజా సామాగ్రి నల్లగా మారిందా? ఇలా చేస్తే తళుక్కున మెరిసిపోతాయ్..!

దేవుడి పూజ సమయంలో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. అయితే ఈ పుణ్యకార్యంలో ఉపయోగించే రాగి, ఇత్తడి, స్టీలు పాత్రలు నల్లగా మారుతుంటాయి. ఈ పాత్రలను కడగడానికి చాలా మంది డిష్‌వాష్ లిక్విడ్‌ని ఉపయోగిస్తారు. అయినప్పటికీ ఇది ఆశించిన ఫలితం ఇవ్వదు. నల్ల మచ్చలు అప్పటికీ అలాగే ఉంటాయి. అయితే, కొందరు మాత్రం ఆ పాత్రలను శుభ్రం చేయడానికి

Brass Copper: పూజా సామాగ్రి నల్లగా మారిందా? ఇలా చేస్తే తళుక్కున మెరిసిపోతాయ్..!
Worship Utensils
Shiva Prajapati
|

Updated on: Mar 27, 2023 | 8:30 AM

Share

దేవుడి పూజ సమయంలో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. అయితే ఈ పుణ్యకార్యంలో ఉపయోగించే రాగి, ఇత్తడి, స్టీలు పాత్రలు నల్లగా మారుతుంటాయి. ఈ పాత్రలను కడగడానికి చాలా మంది డిష్‌వాష్ లిక్విడ్‌ని ఉపయోగిస్తారు. అయినప్పటికీ ఇది ఆశించిన ఫలితం ఇవ్వదు. నల్ల మచ్చలు అప్పటికీ అలాగే ఉంటాయి. అయితే, కొందరు మాత్రం ఆ పాత్రలను శుభ్రం చేయడానికి ప్రత్యేకంగా మార్కెట్‌కి తీసుకెళ్లి క్లీన్ చేయిస్తుంటారు. ఇప్పుడు అంత శ్రమ పడాల్సిన పనిలేదు. ఇంట్లో వినియోగించే కొన్ని వస్తువులతోనే.. పూజా సామాగ్రిని కొత్త వాటిగా మార్చేయొచ్చు. ఆ చిట్కాలు ఇప్పుడు మీకోసం..

1. బేకింగ్ పౌడర్..

బేకింగ్ పౌడర్‌ను అనేక వస్తువులను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. దీని సహాయంతో పూజకు సంబంధించిన పాత్రలను కూడా శుభ్రం చేయవచ్చు. ఒక టబ్‌లో నీటిలో బేకింగ్ పౌడర్, వాషింగ్ పౌడర్ కలపాలి. బాగా కరిగించి, ఆ పాత్రలను రాత్రంతా నానబెట్టాలి. ఉదయం స్క్రబ్ సహాయంతో వాటిని శుభ్రం చేసుకోవాలి. అప్పుడవి కొత్తవిగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

2. చింతపండు..

చింతపండును ఆహారంలో ఉపయోగిస్తాం. అయితే, రాగి, ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించొచ్చు. చింతపండును నీళ్లలో నానబెట్టి, తర్వాత ముద్దలా చేసి పేస్ట్‌లా చేయాలి. ఇప్పుడు ఆ పేస్టును పాత్రలపై రాస్తే.. కొత్త వాటిగా పూజా సామాగ్రి మారుతుంది.

3. వైట్ వెనిగర్..

వైట్ వెనిగర్ క్లీనింగ్ గుణాలను కలిగి ఉంటుంది. ఒక గ్లాసు నీటిలో 2 టీస్పూన్ల వైట్ వెనిగర్ మిక్స్ చేసి గ్యాస్ మీద మరిగించాలి. ఇప్పుడు అందులో డిటర్జెంట్ కలపాలి. ఇప్పుడు దీని సహాయంతో పూజా సామాగ్రిని క్లీన్ చేస్తే.. అద్దంలా మెరిసిపోతాయి.

4. ఉప్పు, నిమ్మకాయ..

ఉప్పు, నిమ్మకాయ మిశ్రమం కూడా క్లీనింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఒక గిన్నెలో నిమ్మరసం, ఉప్పు కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో మురికి పాత్రపై అప్లై చేసి కాసేపు అలాగే ఉంచాలి. కాసేపటి తరువాత గోరువెచ్చని నీటితో కడిగి శుభ్రం చేస్తే.. ఆ పూజా సామాగ్రి కొత్తవిలా మెరిసిపోతాయి.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే