స్మార్ట్ ఫోన్‌తో చిన్నారులకు డేంజర్..మా పిల్లాడు స్మార్ట్ ఫోన్ రఫ్ ఆడిస్తారని మురిసిపోతున్నారా..?
మీ ఇంట్లో ఉండే చిన్న పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారా.. మారం చేయకుండా అదే మంత్రంగా భావిస్తున్నారా.. లేదంటే మా పిల్లలు స్మార్ట్ ఫోన్ రఫ్ ఆడిస్తారని మురిసిపోతున్నారా.. ఇలా చేస్తే మీ పిల్లల భవిష్యత్తును మీరే చేజేతుల మీ పిల్లల భవిష్యత్తులో చీకట్లో నింపుతున్నడు అది నీకు తెలుసా..? డియర్ పేరెంట్స్ బీ అలర్ట్..

పెద్దలైన పిల్లలైనా.. పిల్లలైనా ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం తప్పనిసరిగా మారింది.. కడుపుకు తిండి, కంటికి నిద్ర అక్కర్లేదన్నట్టుగా ప్రతి ఒక్కరు ఫోన్లలో తల మునకలవుతున్నారు. ఫలితం అవసరం కన్నా ఎక్కువగా సెల్ ఫోన్ అనర్ధాలను కొని తెచ్చుకోవడమే జరుగుతుంది. పెద్దల సంగతేమో కానీ.. చిన్నారుల పాలిట సెల్ ఫోన్ వాడకం డేంజర్ గా మారుతుంది. మారం చేస్తున్నారనో.. అన్నం తినడం లేదనో పిల్లలకు సెల్ ఫోన్ ఇస్తూ వారి జీవితాన్ని చీకటి చేస్తున్నామనేది పెద్దలు గమనించడం లేదు. జారుడుమెట్లల స్మార్ట్ ఫోన్లు పిల్లల జీవితాన్ని అగాథంలోకి నెట్టేస్తున్నాయి.. తెలిసి తెలియని మనసులోనే ఎంతోమంది చిన్నారులు స్మార్ట్ ఫోన్‌లకు బానిసలు అవుతున్నారు. కలర్ఫుల్ బొమ్మలు , వీడియో గేమ్స్, యానిమేషన్స్ చూడడానికి ఆనందంగానే ఉన్న పొద్దొస్తమానం సెల్ ఫోన్ వాడడం వలన పిల్లల కంటి చూపు పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్మార్ట్ ఫోన్ వాడకం చిన్నపిల్లల పైన అనేక రకాల దుష్ప్రపరిణామాలకు కారణమవుతుందటున్నారు వైద్యులు. సెల్ఫోన్ రేడియేషన్ వలన పిల్లల కంటిలోని సున్నితమైన రెటీనా దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు. కొన్నిసార్లు కంటిచూపు పూర్తిగా పోయే ప్రమాదం ఉందని చెప్తున్నారు.
అతిగా సెల్ ఫోన్ వాడకం అనార్దనికి దారి తీస్తుంది. చివరకు అందత్వానికి గురిచేస్తుంది. పిల్లలు మారం చేశారనో స్మార్ట్ ఫోన్ వాడకం వలన పిల్లల తెలివి పెరుగుతుందనో చిన్నారులకు మొబైల్ ఫోన్లు ఇస్తే చివరకు మిగిలేది అనార్ధమే. పిల్లలకు కంటి చూపు పోయాక చించించేకన్న ..ముందే తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు వైద్యులు. మా బుజ్జిగాడు స్మార్ట్ ఫోన్ రఫ్ ఆడిస్తాడని మురిసిపోయిన తల్లిదండ్రులరా..బహుపరాక్ మేరే మీబిడ్డల భవిష్యత్తు ను అంధకారం చేస్తున్నారన్న పచ్చి నిజాన్ని ఇకనైనా గుర్తుంచుకోండి.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
