Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Relationship: దాంపత్య జీవితం స్ట్రాంగ్‌గా, హ్యాపీగా ఉండాలంటే ఇలా చేయండి.. ఇక ఆ సమస్యలే ఉండవు..

Relationship Tips: దాంపత్య జీవితంలో ప్రేమ అనేది చాలా అందమైన.. మధురమైన అనుభూతి.. చాలా సందర్భాలలో ప్రజలు భాగస్వామి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అయితే, ఇదే శ్రద్ధ కాలం గడుస్తున్న కొద్ది కనిపించదు.. బంధం బలహీనంగా మారుతుంది. కావున బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం కోసం..

Shaik Madar Saheb

|

Updated on: Jul 23, 2023 | 12:58 PM

Relationship Tips: దాంపత్య జీవితంలో ప్రేమ అనేది చాలా అందమైన.. మధురమైన అనుభూతి.. చాలా సందర్భాలలో ప్రజలు భాగస్వామి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అయితే, ఇదే శ్రద్ధ కాలం గడుస్తున్న కొద్ది కనిపించదు.. బంధం బలహీనంగా మారుతుంది. కావున బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం కోసం రిలేషన్‌షిప్ లో భాగస్వాములిద్దరూ కృషి చేయాలి.. పెళ్లైన కొంత సమయం తర్వాత ప్రేమ, శృంగార సామర్ధ్యం తగ్గడం ప్రారంభమవుతుంది. బాధ్యతలతోపాటు ఒత్తిడి కూడా పెరుగుతుంది. చిన్న చిన్న గొడవలు పెద్ద గొడవలుగా మారతాయి. మనస్పర్థలు పెరుగుతాయి. ప్రశాంతత లోపిస్తుంది.. ఇది కాస్త హద్దుమీరి.. విడిపోవడమే సులువైన పరిష్కారంగా ఇద్దరికీ అనిపిస్తుంది. కావున, బంధాన్ని బలహీనంగా మార్చుకోకుండా.. సురక్షితంగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే.. ఆలూమగలు మధ్య మనస్పర్ధలే తలెత్తవంటున్నారు మానసిక నిపుణులు.. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..

1 / 5
ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం: పెళ్లయిన తర్వాత లేదా మొదటి ప్రేమలో ఒకరితో ఒకరు సమయం గడపడం చాలా బాగుంటుంది. ఒక గంట లేదా ఒక రోజు ఎలా గడిచిపోతుందో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. కానీ సమయం గడిచేకొద్దీ, ప్రజలు తమ భాగస్వామిని తేలికగా తీసుకోవడం ప్రారంభిస్తారు. వేరే పనిలో పడో.. లేక పాత సంబంధానికి ఎక్కువ సమయం ఇవ్వాల్సిన అవసరం లేదనో.. భాగస్వాములు భావిస్తుంటారు. వాస్తవానికి, భాగస్వామితో గడిపే సమయాన్ని తగ్గించినప్పుడు, ఇలాంటి దూరాలు చాలా పెరుగుతాయి. ఇది ఒత్తిడికి కారణం అవుతుంది. కాబట్టి భాగస్వామి కోసం మీ బిజీ షెడ్యూల్ నుంచి కొంత సమయం కేటాయించండి. ఒత్తిడిని తగ్గించడానికి వారితో మనసువిప్పి ఏకాంతంగా మాట్లాడండి. అంతేకాకుండా ముందు వారి మాటను కూడా వినాలి..

2 / 5
గొడవ జరిగినప్పుడు దూరంగా వెళ్లకండి: దంపతుల మధ్య గొడవలు జరగడం మామూలే.. కానీ దాని గురించి మాట్లాడకుండా ఉండటమే పెద్ద తప్పు. మీ తప్పును అంగీకరించి, క్షమించండి.. అని చెప్పి గొడవను పరిష్కరించుకోవడం సరైన మార్గం. మీరు మాట్లాడే మూడ్‌లో లేకుంటే, కలిసి ఆహారం తినడానికి ప్రయత్నించండి. ఇది పోరాటాన్ని త్వరగా ముగించేలా చేస్తుంది. అలా అని గొడవ జరిగినప్పుడు దూరంగా వెళ్లిపోతే.. అది పరిష్కారానికి దారి చూపకుండా.. బంధం భారం అయ్యేలా చేస్తుంది.

3 / 5
మీ భాగస్వామిపై వేరొకరి కోపాన్ని చూపించకండి: చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది.. ఒకరిపై కోపాన్ని మరొకరిపై చూపిస్తుంటారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇది ఎక్కువగా కనిపిస్తుంది. చాలా సార్లు పార్టనర్‌లు ఇంట్లో ఆఫీసు టెన్షన్‌ని బయటకి తీయడం కూడా జరుగుతుంది. మీరు కూడా ఇలా చేస్తే, అది మీ సంబంధాన్ని పాడు చేసే అవకాశం ఉంది.. కావున భాగస్వామితో ఆప్యాయంగా మాట్లాడండి..

4 / 5
కలిసి బయటకు వెళ్లండి: ఎప్పుడూ ఆఫీసు పనుల గురించే ఆలోచించకుండా.. వీకెండ్ లలో లేదా సెలవుల్లో.. భాగస్వామికి సమయం కేటాయించండి.. ఇద్దరూ కలిసి డిన్నర్ కు వెళ్లండి.. లేదా పార్కులకు వెళ్లడం.. ఏదైనా ప్రాంతానికి టూర్ కి వెళ్లడం లాంటివి చేయండి.. ఇలాంటి వాటివల్ల బంధం మరింత మెరుగుపడుతుంది.

5 / 5
Follow us