- Telugu News Photo Gallery Cinema photos Netizens are appreciating Baby Actress Vaishnavi Chaitanya know why telugu cinema news
Vaishnavi Chaitanya: తెలుగమ్మాయి అంటే మాములుగా ఉండదు మరీ.. వైష్ణవిని తెగ మెచ్చుకుంటోన్న నెటిజన్స్..
తెలుగు సినీ పరిశ్రమలోకి తెలుగమ్మాయిలకు అవకాశాలు రావడం చాలా అరుదు. బింధుమాధవి, ఈషా రెబ్బా, అంజలి వంటి ముద్దుగుమ్మలు సెకండ్ హీరోయిన్లుగానే కొనసాగుతున్నారు. కానీ ప్రస్తుతం కథానాయికలుగా తెలుగమ్మాయిలే సత్తా చాటుతున్నారు. ఓవైపు చేతి నిండా సినిమాలతో శ్రీలీల దూసుకుపోతుండగా.. ఇప్పుడిప్పుడే మరికొందరు అమ్మాయిలకు ఆఫర్స్ వస్తున్నాయి.
Updated on: Jul 23, 2023 | 1:23 PM

తెలుగు సినీ పరిశ్రమలోకి తెలుగమ్మాయిలకు అవకాశాలు రావడం చాలా అరుదు. బింధుమాధవి, ఈషా రెబ్బా, అంజలి వంటి ముద్దుగుమ్మలు సెకండ్ హీరోయిన్లుగానే కొనసాగుతున్నారు.

కానీ ప్రస్తుతం కథానాయికలుగా తెలుగమ్మాయిలే సత్తా చాటుతున్నారు. ఓవైపు చేతి నిండా సినిమాలతో శ్రీలీల దూసుకుపోతుండగా.. ఇప్పుడిప్పుడే మరికొందరు అమ్మాయిలకు ఆఫర్స్ వస్తున్నాయి.

ఇటీవలే బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది హీరోయిన్ వైష్ణవి చైతన్య. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా నటించిన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో వైష్ణవి నెగిటివ్ షెడ్స్ ఉన్న హీరోయిన్ పాత్ర.

కథానాయికగా తొలి చిత్రమైన తన పాత్రలో ఒదిగిపోయింది వైష్ణవి. ఎంతగా అంటే నటనపరంగా ప్రశంసలు అందుకున్నప్పటికీ పాత్ర పరంగా ప్రేక్షకుల నుంచి తిట్లు తినేంతగా నటించి మెప్పించింది.

అయితే ప్రస్తుతం వైష్ణవి చైతన్యపై పొగడ్తలు కురిపిస్తున్నారు నెటిజన్స్. తెలుగమ్మాయి అంటే ఇట్టాగే ఉంటది మరీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకో తెలుసా..

అందుకు కారణం బేబీ సినిమా ప్రచార కార్యక్రమాల్లో.. సక్సెస్ ఈవెంట్లలో వైష్ణవి వచ్చిన తీరు. గ్లామర్ షో లేకుండా ఎంతో సింప్లిసిటిగా చూడచక్కగా సంప్రదాయ లుక్లో వచ్చింది.

అందుకు కారణం బేబీ సినిమా ప్రచార కార్యక్రమాల్లో.. సక్సెస్ ఈవెంట్లలో వైష్ణవి వచ్చిన తీరు. గ్లామర్ షో లేకుండా ఎంతో సింప్లిసిటిగా చూడచక్కగా సంప్రదాయ లుక్లో వచ్చింది.

తెలుగమ్మాయి అంటే మాములుగా ఉండదు మరీ.. వైష్ణవిని తెగ మెచ్చుకుంటోన్న నెటిజన్స్..





























