- Telugu News Photo Gallery Cinema photos Do you know about Mem Famous movie Actress Saarya Lakshman telugu movie news
Saarya Laxman: నచ్చినావురో ఫోక్ సాంగ్‌తో ఫేమస్ అయిన ఈ చిన్నది.. హీరోయిన్‌గా అదరగొట్టేసింది..
సోషల్ మీడియాలో చాలా మందికి సరికొత్త లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ఎంతోమంది మట్టిలో మాణిక్యాలను ప్రపంచానికి పరిచయం చేసింది. అలాగే టాలెంట్ ఉండి సినీ పరిశ్రమలోకి వెళ్లాలనుకున్న అమ్మాయిలకు దారి చూపింది. రీల్స్, టిక్ టాక్తో ఫేమస్ అయ్యి ఇప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. కొందరు యాంకరింగ్ చేస్తుండగా.. మరికొందరు సహాయనటిగా మెప్పిస్తున్నారు.
Updated on: Jul 23, 2023 | 12:16 PM

సోషల్ మీడియాలో చాలా మందికి సరికొత్త లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ఎంతోమంది మట్టిలో మాణిక్యాలను ప్రపంచానికి పరిచయం చేసింది. అలాగే టాలెంట్ ఉండి సినీ పరిశ్రమలోకి వెళ్లాలనుకున్న అమ్మాయిలకు దారి చూపింది.

రీల్స్, టిక్ టాక్తో ఫేమస్ అయ్యి ఇప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. కొందరు యాంకరింగ్ చేస్తుండగా.. మరికొందరు సహాయనటిగా మెప్పిస్తున్నారు.

అయితే ఓ ముద్దుగుమ్మ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి హీరోయిన్‌గా అదరగొట్టేసింది. తొలి చిత్రానికి భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తనే హీరోయిన్ సార్య లక్ష్మణ్.

సార్య స్వస్థలం గుంటూరులోని పల్నాడు. కానీ హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు. ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసింది.

కరోనా సమయంలో ఖాళీ ఉంటూ రీల్స్ చేసింది. దీంతో ఆమెకు యూట్యూబ్ కవర్ సాంగ్ లో నటించే అవకాశం వచ్చింది.

నచ్చినావురో ఫోక్ సాంగ్‌తో పాపులరై యూత్ లో క్రేజ్ సంపాదించుకుంది. అందులో క్యూట్ హావభావలకు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో సార్య తెగ ఫేమస్.

ఇటీవలే మేమ్ ఫేమస్ సినిమాలో కథానాయికగా అలరించింది. ఇందులో సార్య నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

నచ్చినావురో ఫోక్ సాంగ్‌తో ఫేమస్ అయిన ఈ చిన్నది.. హీరోయిన్‌గా అదరగొట్టేసింది..




