AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ananya Sharma: భారత వైమానిక దళంలో సరికొత్త రికార్డు.. తండ్రికి తగిన తనయగా నిలిచిన అనన్య శర్మ

భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఫ్లయింగ్ ఆఫీసర్ అనన్య శర్మ ఆమె తండ్రి ఎయిర్ కమోడోర్ సంజయ్ శర్మతో కలిసి కర్ణాటకలోని బీదర్లో అదే ఫార్మేషన్లో ప్రయాణించి విమానయాన చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. తండ్రికి తగిన కూతురిగా నిరూపించుకోవాలనుకున్న అనన్య శర్మ తండ్రి బాటలోనే నడుస్తూ దేశానికి సేవ చేయాలని అనుకుంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో గ్రాడ్యుయేట్ అయిన ఆమె తన తండ్రి అడుగుజాడల్లో ఫైటర్ పైలట్ కావాలని కోరుకుంది. కూతురి ఆలోచనను గౌరవించి ఆమె తండ్రి ఆమెను ప్రోత్సహించాడు.

Ananya Sharma: భారత వైమానిక దళంలో సరికొత్త రికార్డు.. తండ్రికి తగిన తనయగా నిలిచిన అనన్య శర్మ
Ananya Sharma
Nikhil
|

Updated on: Apr 04, 2024 | 5:15 PM

Share

మన దేశంలో చాలాసార్లు పురుషులతో పాటు సమానంగా మహిళలు అన్ని రంగాల్లో తాము సమానమని నిరుపిస్తూ ఉన్నారు. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఫ్లయింగ్ ఆఫీసర్ అనన్య శర్మ ఆమె తండ్రి ఎయిర్ కమాండర్ సంజయ్ శర్మతో కలిసి కర్ణాటకలోని బీదర్లో అదే ఫార్మేషన్లో ప్రయాణించి విమానయాన చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. తండ్రికి తగిన కూతురిగా నిరూపించుకోవాలనుకున్న అనన్య శర్మ తండ్రి బాటలోనే నడుస్తూ దేశానికి సేవ చేయాలని అనుకుంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో గ్రాడ్యుయేట్ అయిన ఆమె తన తండ్రి అడుగుజాడల్లో ఫైటర్ పైలట్ కావాలని కోరుకుంది. కూతురి ఆలోచనను గౌరవించి ఆమె తండ్రి ఆమెను ప్రోత్సహించాడు. 2016 నుంచి ఆమె ఐఏఎఫ్‌లో కొనసాగాలనే కలను ఛేదించడం మొదలు పెట్టి విజయం సాధించింది. ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్ ఫ్లైపాస్ట్ సందర్భంగా ఆఫీసర్ అనన్య శర్మ 15 మంది మహిళా ఐఏఎఫ్ పైలట్లతో కూడిన బృందంలో చేరారు. ఫైటర్ జెట్లు, రవాణా విమానాలు, హెలికాప్టర్లలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ఈ రంగంలో మహిళల భవిష్యత్ ఎలా ఉంటుందో? ఓసారి తెలుసుకుందాం. 

అధికారికంగా వైమానిక దళ అధికారులుగా నియమించే ముందే  ఆశావహులు తమ ప్రయాణాన్ని ఏదైనా ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో ప్రారంభించాలి. అయితే చివరి సంవత్సరం శిక్షణ సమయంలో నెలవారీ రూ.56,100 అలవెన్స్‌గా పొందవచ్చు. ఫ్లయింగ్ ఆఫీసర్లు కమిషన్‌పై సమగ్ర జీతం ప్యాకేజీని పొందుతారు. కాబట్టి ఈ రంగంలో ఆర్థిక ప్రయోజనాలకు విలువనివ్వకుండా శిక్షణ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కమీషన్ తర్వాత ఫ్లయింగ్ ఆఫీసర్లు 8వ సెంట్రల్ పే కమిషన్ (సీపీసీ)కు సంబంధించిన పే మ్యాట్రిక్స్‌లోని లెవల్ 10లో ఉంటారు. అందువల్ల వారికి నెలవారీ చెల్లింపు రూ.56,100గా ఉంటుంది. అదనంగా వారు మిలిటరీ సర్వీస్ పే నెలకు రూ.15,500 సంపాదించవచ్చు. ఫ్లయింగ్ అధికారులు వారి విధులు, పోస్టింగ్లకు అనుగుణంగా వివిధ అలవెన్సులకు అర్హత పొందుతారు. వీటిలో రవాణా భత్యం, పిల్లల విద్యా భత్యం, ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ) వంటి అలవెన్సులు ఉంటాయి.

ఉద్యోగ స్వభావం, పోస్టింగ్ స్థలం ఆధారంగా నిర్దిష్ట అలవెన్సులు అందుకుంటారు. ఇది ఫ్లయింగ్, ట్రాన్స్‌పోర్ట్, టెక్నికల్, ఫీల్డ్ ఏరియా, స్పెషల్ కాంపెన్సేటరీ అలవెన్స్‌లను పొందవచ్చు. సియాచిన్ వంటి సవాలుతో కూడిన భూభాగాల్లో సేవలందించడం నుంచి టెస్ట్ పైలట్లు లేదా ఫ్లైట్ టెస్ట్ ఇంజనీర్లుగా విమాన పరీక్షలను నిర్వహించడం వరకు అధికారులు వారి అంకితమైన సేవకు అదనపు పరిహారం పొందుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…