వరుడి కోసం ప్రకటన ఇచ్చిన 37 ఏళ్ల మహిళ..ఆ ఒక్క కండీషన్ ఏంటో తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది..!
ఇప్పుడు అమ్మాయిలు , వధువు తల్లిదండ్రులు పెళ్లి కోసం పెడుతున్న కండిషన్స్ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల ఫన్నీ పోస్టులు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాను పెళ్లి చేసుకునే అబ్బాయికి భారీగా జీతం, ఇల్లు ఉండాలని.. అత్తమామలు ఉండకూడదు ఇలాంటి అనేక కండిషన్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పడు మన దేశంలో జీవిత భాగస్వామిని పొందడం ఒక సవాల్ గా మారింది. తాజాగా 37 ఏళ్ల మహిళ తాను పెళ్లి చేసుకోవాడనికి వరుడు కావాలని.. అయితే సంవత్సరానికి రూ. 1 కోటి సంపాదించే వ్యక్తి కోసం వెతుకుతున్నట్లు పేర్కొంది.
మారుతున్న కాలంలో పాటు మనిషి ఆలోచనలు, జీవన శైలి, సంప్రదాయాలు, అలవాట్లు అన్నిటిలోనూ మార్పులు వచ్చాయి. పూర్వకాలంలో పెళ్లి అంటే ఇరు కుటుంబాలు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలని అనేవారు. తర్వాత పెళ్లిలో కన్యాశుల్కం .. మళ్ళీ వరకట్నం వివాహంలో ప్రధాన పాత్ర పోషించాయి. అయితే ఇప్పుడు అమ్మాయిలు , వధువు తల్లిదండ్రులు పెళ్లి కోసం పెడుతున్న కండిషన్స్ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల ఫన్నీ పోస్టులు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాను పెళ్లి చేసుకునే అబ్బాయికి భారీగా జీతం, ఇల్లు ఉండాలని.. అత్తమామలు ఉండకూడదు ఇలాంటి అనేక కండిషన్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పడు మన దేశంలో జీవిత భాగస్వామిని పొందడం ఒక సవాల్ గా మారింది.
తాజాగా 37 ఏళ్ల మహిళ తాను పెళ్లి చేసుకోవాడనికి వరుడు కావాలని.. అయితే అతను తన అంచనాలకు అనుగుణంగా ఉండాలంటూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించింది. పోస్ట్ మరాఠీలో ఉండగా దీని ఇంగ్లిష్ అనువాదం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
‘అంబర్’ అనే వినియోగదారు పేరు గల ఒక వ్యక్తి ఈ చాట్ కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశాడు. అది ఒక యువతి సంవత్సరానికి రూ. 1 కోటి సంపాదించే వ్యక్తి కోసం వెతుకుతున్నట్లు చూపిస్తుంది. ఆ మహిళ గత 10 సంవత్సరాలుగా ముంబైలో పని చేస్తోందని, ఉన్నత విద్యావంతుడు కావాలని, సర్జన్ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ కావాలని పోస్ట్ లో పేర్కొంది. అంతేకాదు వరుడికి సొంత ఇల్లు ఉండాలని కోరుకుంది. ఒకవేళ తాను కోరుకున్న లక్షణాలు ఉన్న వరుడు విదేశాలలో ఉంటే.. ఆమె ఐరోపాలోని ఇటలీ అంటే కనుక ఇటలీకి మొదటి ప్రాధాన్యత అని పేర్కొంది.
పోస్ట్‌ను షేర్ చేసిన వినియోగదారు ఇలా రాశారు. సంవత్సరానికి 4,00,000 సంపాదిస్తున్న 37 ఏళ్ల మహిళ తనకు కాబోయే వరుడి కోసం నిరీక్షిస్తుంది. ఈ పోస్ట్ షేర్ చేసి నెక్స్ట్ లెవల్ భ్రమ అనే క్యాప్షన్ కూడా జత చేశాడు.
ఇక్కడ పోస్ట్‌ను చూడండి:
Expectation of groom by a 37 year old female earning 4,00,000 per year, translated from Marathi. This is next level delusion. pic.twitter.com/0ohyDboqpd
— Ambar (@Ambar_SIFF_MRA) April 2, 2024
ఇప్పటికే ఈ పోస్టు 5,82,000 వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు అనేక మంది నెటిజన్లు రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఒక వినియోగదారు పోస్ట్ పై స్పందిస్తూ “ఇందులో తప్పు లేదు. తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. తను పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తిని ఎన్నుకునే హక్కు ఆమెకు ఉంది. అలాగే పురుషులకు ఆమెను తిరస్కరించే హక్కు ఉంది. మరొక వినియోగదారు ఇలా వ్రాశాడు, “IT డేటా ప్రకారం భారతదేశంలో 1.7 లక్షల మంది మాత్రమే ఒక కోటి కంటే ఎక్కువ ఆదాయాన్ని కలిగి ఉన్నారు. కనుక 37 సంవత్సరాల వయస్సులో ఆమె కలగంటున్న మనిషిని కనుగొనే అవకాశం 0.01% మాత్రమే అని చెప్పారు.
రకరకాలగా స్పందించిన నెటిజన్లు
“పెళ్లికొడుకు కూడా సరే సరే నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాలి. అయితే పరిస్థితులు కుదరకపోతే మీరు భరణం అడగకూడదు. ఎవరైనా న్యాయవాది సమక్షంలో ఏదో కాగితంపై సంతకం చేయిస్తారు. అంటూ రకరకాల కామెంట్స్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..