Hungry Elephant Video: అందుకే అది ఏనుగు.. ఆకలేస్తే ఇలాగే ఉంటుంది మరీ..! ప్లేస్ ఏదైనా సరే.. పగిలిపోవాల్సిందే..!
అటవీ సమీప గ్రామాల్లో తరచుగా ఏనుగుల రాక, పంట పొలాలపై ఏనుగుల మంద దాడికి చేయటం, పంటపొలాల్లో విధ్వంసం చేయటం వంటి అనేక సంఘటనలు మనం చూస్తుంటాం. అలాంటి షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో ఏనుగుకు ఆకలి వేసింది, ఆ తర్వాత ఏనుగు ఆహారంతో ఏం చేసిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
ఏనుగు అడవి జంతువు.. అడవిలో కెల్లా అతిపెద్ద శరీరం కలిగినది ఇదే. ఏనుగులు వేల కిలోల బరువును కలిగి ఉంటాయి. గజరాజు తమ పాదాల కింద పడ్డది ఏదైనా సరే.. చూర్ణం చేయగలవు. దానికి ఆగ్రహం వస్తే చుట్టూ అంతా నాశనం చేయగలవు. కానీ, ఏనుగులు మనిషికి మంచి మిత్రులుగా ఉంటాయి. ఎందుకంటే.. ఏనుగులు తెలివైన జంతువులు అంటారు. అయినప్పటికీ ఇవి అడవిలోనే మెరుగ్గా ఉండగల జీవులు. అదే ఏనుగు జనవాసాల్లో చేరితే దాన్ని ఎదుర్కొవటం ఎవరి వల్ల కాదు..అటవీ సమీప గ్రామాల్లో తరచుగా ఏనుగుల రాక, పంట పొలాలపై ఏనుగుల మంద దాడికి చేయటం, పంటపొలాల్లో విధ్వంసం చేయటం వంటి అనేక సంఘటనలు మనం చూస్తుంటాం. అలాంటి షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో ఏనుగుకు ఆకలి వేసింది, ఆ తర్వాత ఏనుగు ఆహారంతో ఏం చేసిందో చూస్తే ఆశ్చర్యపోతారు.
జంతువుల దాడి వీడియోలు చాలా భయానకంగా, దిగ్భ్రాంతిని కలిగిస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మీడియాలో ఆకలితో ఉన్న ఒక ఏనుగు ఏం చేసిందో చూపించారు. అడవిలో కావాల్సిన ఆహారం దొరక్కపోవటంతో ఒక ఏనుగు జనావాసంలోకి చొరబడింది. ఏదో ఒక ఫ్యాక్టరీ గోదాం వంటి ప్రాంతంలోకి ప్రవేశించింది. అక్కడే కొందరు యువకులు అప్పటికే ఏనుగును తరిమికొట్టే ప్రయత్నం చేశారు. కానీ, అవేవీ లెక్కచేయని ఏనుగు నేరుగా ఒక గోడౌన్ షెట్టర్ వద్దకు వెళ్లింది.. బలంగా తన తొండంతో ఆ షెట్టర్‌ను తునా తునకలు చేసేసింది. లోపల ఉన్న ధాన్యం బస్తాల్లోంచి ఓ మూటను లాక్కుని వచ్చేసింది. ఏనుగు తన కాళ్లతో ఆ మూటను పగలగొట్టుకుని అందులో ఉన్న పదార్థాన్ని తిని కడుపు నింపుకునే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో చుట్టూ ఉన్న జనం ఏనుగును తరిమి కొడుతూ కనిపించారు.
The Elephant knows that if there is no food in forest, it has to come to Food Corporation Of India godown to get food. 🐘 pic.twitter.com/JrzHDNE5NK
— Naresh Nambisan | നരേഷ് (@nareshbahrain) April 2, 2024
ఈ వీడియో @nareshbahrain అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడింది. కొద్ది సేపటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై చాలా కామెంట్స్ కూడా కనిపిస్తున్నాయి.. మనం జంతువులను నొప్పించకపోతే అవి మనల్ని బాధించవు అంటూ చాలా మంది వీడియోపై స్పందించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..