AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏఐ టెక్నాలజీ వచ్చిన సరికొత్త ఫ్రిజ్..! ఇది మీ ఇంటికి సీసీ కెమెరా, ఇంట్లో మనిషి కంటే ఎక్కువ..? ఎలాగంటే..

దాదాపు 50 ఏళ్ల క్రితం కంపెనీ తొలిసారిగా ఫ్రిజ్‌ను విడుదల చేసిందని చెప్పారు. అప్పటి నుండి కంపెనీ నిరంతరంగా తన ఆవిష్కరణ ప్రమాణాలను ముందుకు తీసుకువెళుతోందన్నారు. ఇది కొత్త టెక్నాలజీ యుగం, అందుకు తగ్గట్టుగానే  AI సహాయంతో, ప్రజలు డబ్బు, విద్యుత్ వృధాను మాత్రమే కాకుండా ఆహారం కూడా వృధా చేయడాన్ని అరికట్టవచ్చు. ఈ విధంగా ప్రతి ఇంటిపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. 

ఏఐ టెక్నాలజీ వచ్చిన సరికొత్త ఫ్రిజ్..! ఇది మీ ఇంటికి సీసీ కెమెరా, ఇంట్లో మనిషి కంటే ఎక్కువ..? ఎలాగంటే..
Ai Fridge
Jyothi Gadda
|

Updated on: Apr 04, 2024 | 11:44 AM

Share

నేటి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కీలకంగా మారింది. వివిధ ప్రాంతాలు, పనుల్లో AI సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ప్రజలు AI సహాయంతో సోషల్ మీడియాలో వీడియోలు చేయడం కూడా ప్రారంభించారు. ఇక యంత్రాలు కూడా AIని పొందుపరచడం ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే రిఫ్రిజిరేటర్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఇది ఇంటి అవసరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చర్చ జరుగుతోంది. ఈ ఫ్రిడ్జ్ ఉపయోగం ఏంటి..? ఎలా పనిచేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

కాలం మారింది. దాంతో పాటుగానే టెక్నాలజీ విపరీతంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అందులో భాగంగా ఆధునిక ఫ్రిజ్‌లు AIతో పనిచేస్తాయి. ఇది చాలా స్మార్ట్‌గా వర్క్‌ చేస్తుంది. నివేదిక ప్రకారం, Samsung (Samsung AI ఫ్రిజ్) కంపెనీ కూడా AIతో పనిచేసే అలాంటి ఫ్రిజ్‌ను ఏప్రిల్ 3న విడుదల చేసింది. ఇది ఫ్రిజ్‌లో ఉంచిన కిరాణా సామాగ్రి గడువు ముగియబోతున్నప్పుడు, లేదంటే, మీ వస్తువులను ఎవరైనా రహస్యంగా తీసుకున్నప్పుడు, లేదంటే మీరు ఫ్రిడ్జ్‌లో దాచుకున్న ఆహారాన్ని ఎవరైనా తిన్నా కూడా AI ఫ్రిడ్జ్ దాన్ని పసిగట్టేస్తుంది. ఈ ఫ్రిడ్జ్‌ లో పెట్టి ఆహారం ఎప్పుడు తీశారో కూడా చెబుతున్నారు. ఎవరూ తీశారు అనే విషయాన్ని బయటకు చెప్పే్స్తుందట. ఇది మీ ఫోన్‌లో రింగ్ అవుతున్న కాల్‌లను కూడా రిసీవ్‌ చేసుకుంటుందట.

ఈ ఫ్రిజ్ సూపర్ మార్కెట్ నుండి వస్తువులను ఆర్డర్ చేస్తుంది. వంటగదిలో మంచి మ్యూజిక్‌ ప్లే చేస్తుంది. డోర్‌బెల్ ఎవరు మోగిస్తున్నారో కూడా చూపిస్తుంది. ఇవన్నీ ప్రజలకు చాలా డబ్బు ఆదా చేస్తాయి. ఫ్రిజ్‌లో ఉంచిన వస్తువులు ఎప్పుడు అయిపోతున్నాయో తెలియజేస్తుంది. దాంతో మనం కావాల్సిన వస్తువులను సరైన సమయానికి కొనుగోలు చేయవచ్చు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ AI-శక్తితో పనిచేసే ఫ్రిజ్ లోపల ఉంచిన ఆహార పదార్థాలతో ఎలాంటి స్పెషల్‌ వంటకాలు తయారు చేసుకోవచ్చునో కూడా సూచిస్తుందట.

బ్రిటన్‌లోని శాంసంగ్ డిజిటల్ ఉపకరణాల విభాగం డైరెక్టర్ తాన్యా వెల్లర్ మాట్లాడుతూ.. దాదాపు 50 ఏళ్ల క్రితం కంపెనీ తొలిసారిగా ఫ్రిజ్‌ను విడుదల చేసిందని చెప్పారు. అప్పటి నుండి కంపెనీ నిరంతరంగా తన ఆవిష్కరణ ప్రమాణాలను ముందుకు తీసుకువెళుతోందన్నారు. ఇది కొత్త టెక్నాలజీ యుగం, అందుకు తగ్గట్టుగానే  AI సహాయంతో, ప్రజలు డబ్బు, విద్యుత్ వృధాను మాత్రమే కాకుండా ఆహారం కూడా వృధా చేయడాన్ని అరికట్టవచ్చు. ఈ విధంగా ప్రతి ఇంటిపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..