Watch Video: సముద్రం ఒడ్డున తవ్వకాల్లో దొరికిన వింత వస్తువు.. తెరిచి చూడగా 180మిలియన్ ఏళ్లనాటి నిధి..!
వీరు పురాతన విషయాలను పరిశోధిస్తారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రాళ్ల మధ్య మరో గుండ్రటి రాయిని పాతిపెట్టడం వారు గమనించారు. అయితే అందులో ఓ వింత దాగి వుందని ఆ తర్వాత వారికి తెలిసింది. ముందుగా వారు ఆ బండరాయిని పగలగొట్టి రాళ్ల మధ్య నుంచి గుండ్రటి వస్తువును బయటకు తీశారు. తర్వాత దాన్ని కూడా పగలగొట్టాడు. లోపల అతనికి
మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో విచిత్రలు, రహాస్యాలు దాగివున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిశోధకులు ఆ రహస్యాలను చేధించేందుకు నిరంతర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ రహస్యాలు కళ్ల ముందుకి వచ్చినప్పుడు అంతా ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. ఇటీవల ఓ వ్యక్తి సముద్రం ఒడ్డున తవ్వకాలు జరుపుతుండగా, రాళ్లలో దాగివున్న ఒక గుండ్రటి వస్తువు ఇరుక్కుపోయి కనిపించింది. బండరాళ్లను బద్ధలు కొట్టి అతడు ఆ గుండ్రటి వస్తువును వెలికితీయగా, దాని లోపల దాగివున్న రహస్యాన్ని కనిపెట్టాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు, ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆ రహస్యంలో ఏంటో పూర్తి వివరాల్లోకి వెళితే..
వైరల్ అవుతున్న ఈ వీడియో Instagram ఖాతా @yorkshire.fossils అనేది ఆరోన్, షే అనే ఖాతాదారులు ఈ వీడియోను షేర్ చేయగా, అది వైరల్ అవుతోంది. వీరు పురాతన విషయాలను పరిశోధిస్తారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రాళ్ల మధ్య మరో గుండ్రటి రాయిని పాతిపెట్టడం వారు గమనించారు. అయితే అందులో ఓ వింత దాగి వుందని ఆ తర్వాత వారికి తెలిసింది. ముందుగా వారు ఆ బండరాయిని పగలగొట్టి రాళ్ల మధ్య నుంచి గుండ్రటి వస్తువును బయటకు తీశారు. తర్వాత దాన్ని కూడా పగలగొట్టాడు. లోపల అతనికి రెండు శిలాజాలు కనిపించాయి. ఆ గుండ్రని రాయి ఒక రకమైన శిలాజంగా వారు గుర్తించారు.. ఇందులో అమ్మోనైట్‌ల శిలాజాలు ఉన్నాయి. ఇవి మురి ఆకారంలో ఉన్నాయి. సుమారు 180 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ భూమిపై ఉండేవని చెప్పారు. ఈ రాయిపై ఇనుప పైరైట్ పొర ఉందని, దానిని రుద్దడం ద్వారా అది ఫ్లాట్‌గా, మెరిసిపోతుందని వారు వివరించారు.
View this post on Instagram
వైరల్ అవుతున్న వీడియోకి 11 లక్షల మంది వీక్షణలు వచ్చాయి. చాలా మంది తమ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసారు. అది ఫేక్ అని కొందరు కామెంట్ చేయగా, ఈ వ్యక్తి ప్రతి వీడియోలోనూ ఇలాగే ఉంటాడని మరొకరు చెప్పారు. ఈ రాళ్లు ఎక్కడ దొరుకుతాయో అతనికి ఎలా తెలుసు అని ఇంకొకరు అడిగారు. ఇలా చాలా మంది నెటిజన్లు వీడియోపై భిన్నమైన అభిప్రాయాలను తెలియజేస్తు్న్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..