Banana for Hair : అరటిపండులో దాగివున్న కేశ సౌందర్యం..! ఇలా హెయిర్‌ ప్యాక్‌ తయారు చేసి వాడితే.. జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుందట..

20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా నెలలో రెండు సార్లు చేయడం వల్ల జుట్టు సమస్యలు దూరమవుతాయి. అరటిపండ్లలో విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం , సిలికాన్ వంటి పోషకాలు నిండి ఉంటాయి. ఇవన్నీ కూడా జుట్టుకి మేలు చేస్తాయి. పాడైన జుట్టును రిపేర్‌ చేస్తుంది.. దీనిని ప్యాక్‌లా చేసి వాడడం వల్ల జుట్టుకి కండీషనర్‌లా పనిచేస్తుంది. అంతే కాదు జుట్టు బౌన్సీగా, బలంగా మారుతుంది.

Banana for Hair : అరటిపండులో దాగివున్న కేశ సౌందర్యం..! ఇలా హెయిర్‌ ప్యాక్‌ తయారు చేసి వాడితే..  జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుందట..
Banana For Hair
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 03, 2024 | 1:57 PM

Banana for Hair : ప్రస్తుతం కాలంలో చాలా మంది జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. జుట్టు రాలిపోవటం, చిట్లిపోవటం, నెరిసిన జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఖరీదైన ట్రీట్‌మెంట్స్ కోసం హెయిర్ సెలూన్లు, పార్లర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ, కేశ సంరక్షణ కోసం ఖర్చు చేయాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. కొన్ని ఇంటి చిట్కాలతోనే సమస్యని దూరం చేసుకోవచ్చునని సూచిస్తున్నారు. అందులో ఒకటి అరటి పండుతో మాస్క్. అవును.. అరటి పండ్లతో తయారు చేసిన మాస్క్‌తో జుట్టు సమస్యలు చాలా వరకూ దూరమవుతాయి. అవును, కేవలం సగం అరటిపండుతో కొన్ని పదార్థాలను కలపడం వల్ల కేవలం తక్కువ సమయంలోనే జుట్టు సమ్యలకు పరిష్కారం లభిస్తుంది. దీనికి కావలసిన పదార్థాలు ఏమిటి? దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం…

అరటిపండులో విటమిన్ బి6, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టుకు ఎంతో అవసరమైనవి. జుట్టును సిల్కీగా మృదువుగా మార్చుతాయి. అదేవిధంగా బ్లాక్‌ బీన్స్‌ జుట్టుకు మృదుత్వాన్ని, తేజాన్ని, మెరుపును ఇస్తాయి. అంతేకాకుండా, ఆలివ్ ఆయిల్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. తెల్లజుట్టు కోసం అరటిపండు, ఒక చెంచా బ్లాక్ బీన్ పౌడర్, ఒక చెంచా ఆలివ్ ఆయిల్ తో హెయిర్ ప్యాక్‌ తయారు చేసుకోవచ్చు. ఒక పెద్ద సైజు అరటిపండులో సగం అరటిపండు తీసుకుని ఒక గిన్నెలో వేసి బాగా స్మాష్‌ చేసుకోవాలి.. తర్వాత ఒక చెంచా ఆలివ్ ఆయిల్, ఒక చెంచా బ్లాక్‌బీన్స్‌ పౌడర్‌ వేసి బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇది చక్కటి హెయిర్‌ ప్యాక్‌లా తయారవుతుంది. ఆ తర్వాత జుట్టుకు హెయిర్ డై వేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్‌ను రూట్ నుండి చివర్ల వరకు బాగా అప్లై చేయండి. ఒక గంట పాటు అలాగే వదిలేయండి. జుట్టు బాగా ఆరిన తర్వాత శుభ్రంగా వాష్‌ చేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్‌ని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల మీ తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మారుతుంది.

ఒక అరటి పండులో మిశ్రమంలో ఒక టీ స్పూన్ అలోవేరా జెల్, ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్‌ తీసుకోవాలి. విటన్నీంటిని కలిపి మిక్సీలో వేసి మెత్తని పేస్టు‌లా చేసుకోవాలి. ఇది మంచి క్రీమీగా తయారవుతుంది. దీనిని జుట్టు మొత్తానికి అప్లై చేయాలి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా నెలలో రెండు సార్లు చేయడం వల్ల జుట్టు సమస్యలు దూరమవుతాయి. అరటిపండ్లలో విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం , సిలికాన్ వంటి పోషకాలు నిండి ఉంటాయి. ఇవన్నీ కూడా జుట్టుకి మేలు చేస్తాయి. పాడైన జుట్టును రిపేర్‌ చేస్తుంది.. దీనిని ప్యాక్‌లా చేసి వాడడం వల్ల జుట్టుకి కండీషనర్‌లా పనిచేస్తుంది. అంతే కాదు జుట్టు బౌన్సీగా, బలంగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..