AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: వారెవ్వా.. ఏం టాలెంట్‌ అక్కా నీది..! బైక్‌ రూపాన్నే మర్చేశావ్‌గా..? సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ చూసి ఫిదా అవ్వాల్సిందే..

వైరల్ అవుతున్న వీడియోలో ముందుగా ఒక మహిళ తన భర్త కోసం బాక్స్‌లో ప్యాక్‌ చేసిన బైక్‌ను గిఫ్ట్‌గా చూపించటం కనిపించింది. ఆ మహిళ భర్త రాగానే అట్ట పెట్టె తెరిచి చూడగా అందులో ఎంతో అద్భుతంగా అలంకరించిన బైక్ కనిపించింది. ఈ ప్రత్యేకమైన బైక్‌ను చూసిన అతడు అవాక్కయ్యాడనే చెప్పాలి. బైక్‌ డెకరేషన్‌ చూసి అతడు నిజంగా ఆశ్చర్యపోయాడు. టూవీలర్ హ్యాండిల్ తాళాల నుండి చక్రాల వరకు కూడా ఆ ఇల్లాలు బైక్‌ మొత్తాన్ని ఇలా

Watch Video: వారెవ్వా.. ఏం టాలెంట్‌ అక్కా నీది..! బైక్‌ రూపాన్నే మర్చేశావ్‌గా..? సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ చూసి ఫిదా అవ్వాల్సిందే..
Active Decoration
Jyothi Gadda
|

Updated on: Apr 03, 2024 | 12:01 PM

Share

అది వివాహ వేడుక అయినా, పుట్టినరోజు అయినా, వార్షికోత్సవమైనా లేదా సంతోషకరమైన వార్తల వేడుక ఏదైనా సరే.. ఇంటిని, ఇంటితో పాటు ఇంటి పరిసరాలను శుభ్రంగా, అందంగా, చూడ చక్కగా అలంకరించుకోవటం ఆడవాళ్లకు చాలా ఇష్టం. అలాగే కొందరు పాతవి ఉపయోగంలో లేని వస్తువులను ఉపయోగించి కూడా అందమై కళాఖండాలను తయారు చేస్తుంటారు. అయితే, మీరు ఎప్పుడైనా బైక్‌ను అలంకరించారా? లేదు కాదు…కానీ, ఇక్కడో ఇల్లాలు బైక్‌ను ఫుల్లుగా డెకరేట్‌ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో ఓ మహిళ తన బైక్‌ను ప్రత్యేకంగా అలంకరించి తన భర్తకు సర్ ప్రైజ్ ఇచ్చింది. వైరల్ అవుతున్న వీడియో గుజరాత్‌కు చెందినదిగా తెలిసింది. హేతల్ అనే మహిళ తన బైక్‌ను ఎంతో ప్రత్యేకంగా అలంకరించింది.

వైరల్ అవుతున్న వీడియోలో ముందుగా ఒక మహిళ తన భర్త కోసం బాక్స్‌లో ప్యాక్‌ చేసిన బైక్‌ను గిఫ్ట్‌గా చూపించటం కనిపించింది. ఆ మహిళ భర్త రాగానే అట్ట పెట్టె తెరిచి చూడగా అందులో ఎంతో అద్భుతంగా అలంకరించిన బైక్ కనిపించింది. ఈ ప్రత్యేకమైన బైక్‌ను చూసిన అతడు అవాక్కయ్యాడనే చెప్పాలి. బైక్‌ డెకరేషన్‌ చూసి అతడు నిజంగా ఆశ్చర్యపోయాడు. టూవీలర్ హ్యాండిల్ తాళాల నుండి చక్రాల వరకు కూడా ఆ ఇల్లాలు బైక్‌ మొత్తాన్ని ఇలా.. పూసలు, చమ్కీలతో అలంకరించింది. వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.

ఇవి కూడా చదవండి

భర్తకు సర్ ప్రైజ్ ఇవ్వకముందే ఆ మహిళ ఎంతో ప్రేమగా ఆ బైక్ ను డెకరేట్ చేయడం వైరల్ వీడియోలో కనిపించింది. అందుకోసం వివిధ రకాల పూసలు, బీట్స్‌వి అనేకం ఉపయోగించి ఆ బైక్‌ను ఎంతో అందంగా తీర్చి దిద్దింది. రకరకాల ఎంబ్రాయిడరీలు చేస్తూ పూసలు, స్టిక్కీ గమ్‌లను ఒక్కొక్కటిగా రాసుకుని బైక్‌ను అందంగా అలంకరించడం కనిపిస్తుంది.

ఈ వీడియో Instagram ఖాతా @hetal_diy_queen నుండి సోషల్ మీడియాలో షేర్‌ చేయబడింది. వీడియోను చూసిన తర్వాత, కొంతమంది నెటిజన్లు మహిళను ట్రోల్ చేయగా, మరికొందరు వ్యాఖ్యలలో మహిళ నైపుణ్యం, బైక్ ప్రత్యేక డిజైన్‌ను ప్రశంసించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..