Viral: ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్వకాలు.. తవ్వుతుండగా బయటపడ్డ అరుదైన అద్భుతం!

తమిళనాడులోని తిరువారూర్ మండలంలో పునాది తవ్వకాల్లో జరుపుతుండగా.. ఓ అరుదైన అద్భుతం బయటపడింది. దాన్ని చూసిన స్థానికులు దెబ్బకు ఆశ్చర్యపోయారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందామా.. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సొంత జిల్లా..

Viral: ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్వకాలు.. తవ్వుతుండగా బయటపడ్డ అరుదైన అద్భుతం!
Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 03, 2024 | 11:52 AM

తమిళనాడులోని తిరువారూర్ మండలంలో పునాది తవ్వకాల్లో జరుపుతుండగా.. ఓ అరుదైన అద్భుతం బయటపడింది. దాన్ని చూసిన స్థానికులు దెబ్బకు ఆశ్చర్యపోయారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందామా.. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సొంత జిల్లా తిరువారూర్‌లో పురాతన కాలం నాటి శ్రీరాముడి విగ్రహం లభ్యమైంది. స్థానికంగా పూల దుకాణం నిర్వర్తిస్తున్న యజమాని మరిముత్తు తన ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్వకాలు జరపగా.. కొంతమేర తవ్వగానే పురాతన శ్రీరాముని విగ్రహం బయటపడింది. దీంతో స్థానిక ఆశ్చర్యానికి గురయ్యారు.

ఆ శ్రీరాముని విగ్రహం పంచలోహాలతో తయారు చేసిందిగా గ్రామస్తులు గుర్తించారు. దీని పొడవు 2 అడుగులు ఉంది. దేవుడి విగ్రహం కనిపించడంతో ఒక్కసారిగా స్థానికులు పూలమాలలతో పూజలు చేశారు. అనంతరం ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించారు. కాగా, ఘటనాస్థలికి చేరుకున్న పురావస్తు శాఖ అధికారులు.. ఆ శ్రీరాముడి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి పరిశీలన తర్వాతే.. విగ్రహం ఎంత విలువ కడుతుంది.? ఎన్ని ఏళ్ల కిందటిదో చెప్పగలమని అన్నారు.