Lok Sabha Election 2024: ఇదెక్కడి ‘చిల్లర’ నామినేషన్‌ సామీ..! తలలు పట్టుకున్న అధికారులు.. సిబ్బందికి ముచ్చెమటలు

2024 లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నెల 19న మొదటి దశ పోలింగ్​ జరగనుంది. 6 వారాల పాటు జరిగే సార్వత్రిక ఎన్నికలు.. ఏప్రిల్ 19న ప్రారంభం కానుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఏడు దశల్లో ఎన్నికలు జరుగనుండగా, పది లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్​జరగనుంది.

Lok Sabha Election 2024: ఇదెక్కడి ‘చిల్లర’ నామినేషన్‌ సామీ..! తలలు పట్టుకున్న అధికారులు.. సిబ్బందికి ముచ్చెమటలు
Nomination
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 03, 2024 | 1:05 PM

Lok Sabha Election 2024: దేశంలో సమ్మర్‌ సీజన్‌ మొదలైంది. మరోవైపు పెరుగుతున్న ఎండవేడితో పాటుగా ఎలక్షన్‌ హీట్‌ కూడా రాజుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల జోరు దేశవ్యాప్తంగా ఊపందుకుంది. ఏ పార్టీ విజయపతాకం ఎగుర వేస్తోందనే ఉత్కంఠ ఇప్పటి నుంచే ఊపందుకుంది. ఏప్రిల్ 19న తొలి దశ ఓటింగ్ జరగనుంది. దీనికి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. సాధారణంగా, అభ్యర్థులు తమ ప్రియమైన వారిని, బంధువులను, మద్దతుదారులను నామినేషన్ దాఖలు చేయడానికి తీసుకువెళతారు. ఒక రకంగా చెప్పాలంటే నామినేషన్‌ దాఖలు చేసేందుకు వెళ్తున్న అభ్యర్థి సంబరాల కోలాహాల వాతావరణంలో సందడిగా వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలో ఓ విచిత్ర నామినేషన్‌ దాఖలైంది. సదరు అభ్యర్థి నామినేషన్‌ సందర్భంగా ఎలక్షన్‌ అధికారులకే చెమటలు పట్టించాడు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

Unique Nomination

మహారాష్ట్రలోని బుల్దానా లోక్‌సభ స్థానం నుంచి మహా లోక్‌సభ అభ్యర్థి వికాస్ అఘాడి ఎన్నికల నామినేషన్‌ దాఖలు చేసేందుకు వెరైటీగా వచ్చారు. ఒక్కో రూపాయి కాయిన్‌తో మొత్తం 10 వేల రూపాయలు చిల్లర తీసుకువచ్చాడు. రూపాయి నాణేల మూఠతో నామినేషన్‌ దాఖలు చేసేందుకు వచ్చిన ఆ అభ్యర్థిని చూసిన ఎన్నికల అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. అవన్నీ లెక్కించేందుకు ఎన్నికల కార్యకర్తలు చెమటలు చిందించాల్సి వచ్చింది. ఈ ప్రత్యేకమైన లోక్‌సభ ఎన్నికల 2024 నామినేషన్ కు సంబంధించిన విషయం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది.

2024 లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నెల 19న మొదటి దశ పోలింగ్​ జరగనుంది. 6 వారాల పాటు జరిగే సార్వత్రిక ఎన్నికలు.. ఏప్రిల్ 19న ప్రారంభం కానుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఏడు దశల్లో ఎన్నికలు జరుగనుండగా, పది లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్​జరగనుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..