Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి అన్యాయం?.. 12ఏళ్ల బాలికను పెళ్లాడిన వృద్ధుడు.. ఆరేళ్ల క్రితమే నిశ్చయం..! భగ్గుమంటున్న నెటిజన్లు..

అయితే ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. ఈ వివాహానికి డజన్ల కొద్దీ ప్రజలు హాజరైనట్లు స్థానిక మీడియా నివేదికలు చూపించాయి. ఈ పెళ్లి గురించిన విషయం వెలుగులోకి రావడంతో దుమారం రేగింది. ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కూడా దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ ఆధునిక కాలంలో కూడా 12 ఏళ్ల అమ్మాయి భార్య ఎలా అవుతుంది? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు..

ఇదెక్కడి అన్యాయం?.. 12ఏళ్ల బాలికను పెళ్లాడిన వృద్ధుడు.. ఆరేళ్ల క్రితమే నిశ్చయం..!  భగ్గుమంటున్న నెటిజన్లు..
Old priest marries 12-year-old girl
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 03, 2024 | 9:57 AM

వివాహం అనేది ఈడు జోడు కలిగిన స్త్రీ, పురుషులను కలిపే పవిత్ర బంధం. సాధారణంగానే సోషల్ మీడియాలో అనేక పెళ్లి వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అలాంటి వాటిల్లో కొన్ని వెడ్డింగ్‌ వేడుకలు సరదాగా, ఉంటే, మరికొన్ని షాకింగ్‌గా ఉంటాయి. అయితే, కొన్ని అసాధారణ వివాహాలకు సంబంధించిన విషయాలు కూడా మనం చూస్తుంటాం. అయితే, ఇక్కడ కూడా అలాంటి సంఘటనే కనిపిస్తుంది. ఇక్కడ వైరల్‌ అవుతున్న వీడియోలో వధూవరుల మధ్య వయస్సులో భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. పశ్చిమాఫ్రికాలోని ఘనాలో 62 ఏళ్ల వ్యక్తి 12 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఇలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ పెళ్లి గురించి విని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెళ్లిని తీవ్రంగా ఖండిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మీడియా నివేదికల ప్రకారం, పశ్చిమ ఆఫ్రికాలోని ఘనాలో 63 ఏళ్ల వృద్ధుడు, నుమో బోర్కెట్ లావే త్సురు అనే12 ఏళ్ల అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అమ్మాయికి 6 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఈ వివాహం నిశ్చయించబడింది. క్రోవర్‌లోని నంగువాలో సంప్రదాయ వేడుకగా ఈ వివాహం జరిగింది. వివాహానికి హాజరైన మహిళలు 12 ఏళ్ల బాలికను పెళ్లికి సిద్ధం చేసినట్టుగా అర్థమవుతోంది. అయితే ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. ఈ వివాహానికి డజన్ల కొద్దీ ప్రజలు హాజరైనట్లు స్థానిక మీడియా నివేదికలు చూపించాయి. ఈ పెళ్లి గురించిన విషయం వెలుగులోకి రావడంతో దుమారం రేగింది. ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కూడా దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

ఈ వివాహానికి సంబంధించిన వీడియో, ఫొటోలను చూసిన స్థానికులు ఈ పెళ్లి అక్రమమని, అనధికారికమని మండిపడుతున్నారు. అయితే, ఇప్పుడు ఈ వివాహాన్ని రద్దు చేసి, త‌సూరుపై విచార‌ణ చేయాల‌న్న డిమాండ్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే, వైరల్‌ వీడియోని చూసిన నెటిజన్లు పెద్ద సంఖ్యలో సంఖ్యలో స్పందించారు. ఘనాలో బాల్య వివాహాన్ని నేరంగా పరిగణిస్తారని, అలాంటి వివాహం జరగదని ఒకరు రాశారు. ఈ దేశంలో చాలా తప్పులు జరుగుతాయిని, వాటిలో ఇది ఒకటి అని మరొకరు రాశారు! ఈ ఆధునిక కాలంలో కూడా 12 ఏళ్ల అమ్మాయి భార్య ఎలా అవుతుంది? ఇది తెలివితక్కువ పని.. జోక్ కాదా? ఇలాంటి సంఘటనల వల్లనే మనల్ని ఎగతాళి చేస్తున్నారు, దీన్ని ఆపాలి అని మరొకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..