Viral Videos: మద్యం మత్తులో విదేశీయుడు వీరంగం.. నడిరోడ్డుపై బట్టలు విప్పేసుకుని హల్‌చల్..
మద్యం మత్తులో ఉన్న ఫారిన్ వ్యక్తి తన టీ షర్టు తీసి రోడ్డుపై అటు, ఇటు పరుగెత్తటం మొదలుపెట్టాడు. స్థానికుల సాయంతో పోలీసులు రంగంలోకి దిగారు. మద్యం మత్తులో ఉన్న విదేశీయుడిని అదుపు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు ఈ విదేశీ పౌరుడి ప్రవర్తనపై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆగ్రహం వ్యక్తం చేశారు.
చెన్నై రోడ్డుపై ఓ విదేశీ యువకుడు వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఉన్న అతడు నానా రచ్చ చేశాడు. అతనికి ఏదో విషయంలో కోపం వచ్చిందని చెబుతున్నాడు. ఆ మత్తులోనే అతడు.. మార్గమధ్యలో బట్టలు విప్పేసుకుని హంగామా చేశాడు. అంతే కాదు ఆ వ్యక్తి దారిన వెళ్లేవారిని కూడా ఇబ్బందులకు గురిచేశాడు.. కనిపించిన వారిని పట్టుకుని గట్టి కొరికేస్తున్నాడు. చివరకు సమాచారం అందుకున్న పోలీసులు ఎలాగోలా అతన్ని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. దాంతో విషయం సద్దుమణిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అందిన సమాచారం ప్రకారం, మద్యం మత్తులో ఉన్న విదేశీ జాతీయుడు చెన్నైలోని రాయపేట ప్రాంతంలో రచ్చ సృష్టించడం ప్రారంభించాడు. అంతేకాదు, అటుగా వెళ్తున్న వారిని పట్టుకుని కొరికేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ముందుకు వచ్చి అతడిని అదుపు చేసేందుకు ప్రయత్నించడంతో తాగుబోతు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత పోలీసులను పిలవాల్సి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న ఫారిన్ వ్యక్తి తన టీ షర్టు తీసి రోడ్డుపై అటు, ఇటు పరుగెత్తటం మొదలుపెట్టాడు. స్థానికుల సాయంతో పోలీసులు రంగంలోకి దిగారు. మద్యం మత్తులో ఉన్న విదేశీయుడిని అదుపు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు ఈ విదేశీ పౌరుడి ప్రవర్తనపై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆగ్రహం వ్యక్తం చేశారు.
This happened in Chennai..A foreign National reportedly in an inebriated state, running around trying to bite commuters.. pic.twitter.com/wT2Y5B0HIy
— Pramod Madhav (@PramodMadhav6) April 2, 2024
ఈ ఘటన కొన్ని నెలల క్రితమే జరిగినా, దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అలెగ్జాండర్ సిల్వా అనే వ్యక్తి అమెరికాలో నివాసిస్తున్నాడు. ఘటన జరగడానికి రెండు నెలల ముందు చెన్నై వచ్చి ఓ హోటల్‌లో బస చేశాడు. అతను సోలార్ పవర్ యూనిట్‌లో అసెంబ్లర్, ఎలక్ట్రీషియన్‌గా పనిచేశాడు. అయితే అతను ఒక రోజు మద్యం మత్తులో స్థానిక యువకులపై దాడి చేశాడు.
మీడియా కథనాల ప్రకారం, నిందితుడు సిల్వాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించినందుకు, ప్రభుత్వ ఉద్యోగులను తమ విధులను నిర్వర్తించకుండా నిరోధించడం, నేరపూరిత బెదిరింపుల పేరిట కేసు నమోదు చేశారు. అయితే బెయిల్ పొంది విడుదలయ్యాడని సమాచారం.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..