ఈ జబ్బులుంటే పచ్చి మామిడి ముక్కపై ఉప్పు, కారం కలిపి ఒక్కసారి తినండి..! మీ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికినట్టే..?

ఎండాకాలం అంటేనే మామిడికి సీజన్..ఓ వైపు ఎండలు దంచికొడుతున్నా మార్కెట్లో మామిడి రకాలు మాత్రం ఊరిస్తుంటాయి. అయితే, ముందుగా పచ్చిమామిడి కాయలంటే.. చాలా మందికి చూడగానే నోట్లో నీళ్లు ఊరిపోతుంటాయి. పచ్చి మామిడి కాయ ముక్కలపై ఉప్పు, కారం కలిపి తింటే దాని రుచి చెప్పలేం. ఒక్క మాటలో చెప్పాలంటే.. స్వర్గం అంచుల దాకా వెళ్లినంత కమ్మగా ఉంటుంది. మామిడికాయ ముక్కలపై ఉప్పు, కారం చల్లుకుని తింటే.. అలా తింటూనే ఉండాలని అనిపిస్తుంది. ఇది రుచి కేవలం నోటికి మాత్రమే కాదండోయ్..పచ్చి మామిడికాయ, ఉప్పు, కారం కలిపి తింటే కొన్ని వ్యాధులు కూడా నయం అవుతాయంటున్నారు ఆరోగ్యనిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

|

Updated on: Apr 02, 2024 | 1:47 PM

మామిడికాయల్లో చక్కెర చాలా తక్కువగా ఉంటుంది. మధుమేహంతో బాధపడేవారు ఎలాంటి ఆందోళన లేకుండా పచ్చి మామిడి కాయలను ఎంచక్కా లాంగించేయొచ్చు. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. రక్తప్రసరణ సక్రమంగా జరిగితే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మామిడి రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయపడతాయి. పచ్చిమామిడిలో మెగ్నీషియం, పొటాషియం,సంపూర్ణం గా లభిస్తాయి.  కాబట్టి, పచ్చి మామిడికాయ తినడం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

1 / 5
పచ్చి మామిడికాయ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్‌ నియంత్రణలోకి వస్తే అనేక వ్యాధులను నయం చేస్తుంది.  మామిడికాయలో జీర్ణక్రియకు అవసరమైన అమైలేస్ అనే డైజెస్టివ్ ఎంజైమ్‌లు ఉంటాయి. అమైలేస్ ఎంజైమ్‌లు సంక్లిష్ట కార్బోహైడ్రేట్‌లను మాల్టోస్, గ్లూకోజ్ వంటి చక్కెరలుగా మార్చడంలో సహాయపడతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

2 / 5
బరువు తగ్గాలనుకునే వారికి మామిడికాయలు ఉత్తమ ఔషధం. మామిడిలో ఉండే ఎనెనిన్ కొవ్వు, కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. దీని ద్వారా మామిడి కూడా బరువు నియంత్రణలో సహాయపడుతుంది. పచ్చి మామిడి కాయ వేసవి వేడిమి  ప్రభావాన్ని తగ్గిస్తుంది. శరీరంలో నీటి శాతం పెంచేందుకు పచ్చి మామిడి తింటారు.

3 / 5
ఇమ్యునిటీ ని తిరిగి పొందాలంటే పచ్చి మామిడి దోహదం చేస్తుంది. పచ్చిమామిడిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి పచ్చి మామిడి ముక్కలపై కాస్త ఉప్పు, కారం దట్టించి తింటే.. ఇమ్యునిటీ ని పెంచేందుకు సహకరిస్తుంది. అంతేకాదు.. పచ్చి మామిడి కాయ తినటం వల్ల వేసవిలో వచ్చే సమస్యల నుంచి రక్షించుకోవచ్చు.

4 / 5
పచ్చి మామిడి కాయలో లభించే ఫెనోల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తాయి. అది క్యాన్సర్ వల్ల వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మామిడి కాయ శరీరంలో వచ్చే వాపులను తగ్గిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. పచ్చి మామిడి కాయ తినడం వల్ల చర్మం సంరక్షిస్తుంది. పచ్చిమామిడి తినడం వల్ల మొటిమలు, మొటిమల వల్ల ఏర్పడే మచ్చలు, కంటికింద చారలు, గుంటలు పడడం, రకరకాల సమస్యలను దూరం చేస్తుంది. (ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

5 / 5
Follow us