Jungle Safari: జంగిల్ సఫారిలో షాకింగ్ సీన్..! పర్యాటకులు చూస్తుండగానే ఆవుపై దూకిన పులి.. భయానక దృశ్యం వైరల్
సఫారీ జీప్ నుండి పార్క్ సుందరమైన అందాలను ఆరాధించడం చూడవచ్చు. అంతలోనే ఒక ఆవు వారి దారికి అడ్డుగా వచ్చింది. అది ఆ రోడ్డు దాటుతుండగా, హఠాత్తుగా ఒక పులి పొదల్లోంచి ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చి ఆవుపై దాడికి దిగింది. ఇలాంటి ఊహించని సంఘటన పర్యాటకులను ఆశ్చర్యపరిచింది. అదృష్టవశాత్తూ, పులి మరింత హాని చేసేలోపు..
కొంతమంది పర్యాటకులు రాజస్థాన్‌లోని రణతంబోర్ నేషనల్ పార్క్‌లో జంగిల్ సఫారీని ఆస్వాదిస్తున్నారు. చేతిలో కెమెరా పట్టుకుని వీడియో తీస్తుండగా.. ఎవరూ ఊహించని ఘటన జరిగింది. ఉత్కంఠభరితమైన ఈ ఘటనను చూసిన పర్యాటకులు షాక్‌కు గురయ్యారు. ఒక వైరల్ వీడియోలో, ఒక పులి అకస్మాత్తుగా పొదల నుండి బయటకు వచ్చి ఆవుపై దాడి చేసింది. ఈ ఘటనను పర్యాటకులు కెమెరాలో బంధించారు. షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియోను రణథంబోర్ నేషనల్ పార్క్ అధికారులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్ వైరల్‌గా మారింది.
వీడియోలో పర్యాటకులు సఫారీని ఆస్వాదించడం. ఫోటోలు, వీడియోలు తీయడం మనం చూడొచ్చు. సఫారీ జీప్ నుండి పార్క్ సుందరమైన అందాలను ఆరాధించడం చూడవచ్చు. అంతలోనే ఒక ఆవు వారి దారికి అడ్డుగా వచ్చింది. అది ఆ రోడ్డు దాటుతుండగా, హఠాత్తుగా ఒక పులి పొదల్లోంచి ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చి ఆవుపై దాడికి దిగింది. ఇలాంటి ఊహించని సంఘటన పర్యాటకులను ఆశ్చర్యపరిచింది. అదృష్టవశాత్తూ, పులి మరింత హాని చేసేలోపు ఆవు తప్పించుకోగలిగింది. నేషనల్ పార్క్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా వీడియో షేర్ చేయగా అది వైరల్ అవుతోంది. ఈ షాకింగ్ సంఘటన 38,000 వీక్షణలను సంపాదించింది.
View this post on Instagram
కాగా, సఫారీ జీపుకు అతి సమీపంలో ఈ ఘటన జరగడంతో పర్యాటకులు షాక్‌కు గురయ్యారు. రణతంబోర్ నేషనల్ పార్క్ నుండి వీడియోలు తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయబడతాయి. అవి వన్యప్రాణుల ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అంతకుముందు, పార్క్‌లోని నీటి గుంటలోకి పులి తన ఎరను లాగుతున్న వీడియో కూడా ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది.
ఆగ్నేయ రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్ జిల్లాలో ఉన్న రణథంబోర్ నేషనల్ పార్క్ ఒకప్పుడు జైపూర్ మహారాజుల వేట ప్రదేశం. వన్యప్రాణులు, ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..