Watch Video: బట్టల దుకాణంలో చెలరేగిన మంటలు.. మూడంతస్తుల భవనంలో నిండుకుటుంబం.. నిద్రలోనే సజీవ దహనం..

ఈ ఘటన గురించి అందిన మరింత సమాచారం ప్రకారం, ఘటన జరిగిన సమయంలో మూడు అంతస్తుల భవనంలో మొత్తం 16 మంది ఉన్నారు. మొదటి అంతస్తులో ఏడుగురు నివసిస్తున్నారు. రెండవ అంతస్తులోనూ మరో ఏడుగురు, మూడవ అంతస్తులో మరో ఇద్దరు ఉంటున్నారని తెలిసింది. ఈ షాపులో మంటలు చెలరేగడంతో రెండో అంతస్థులో ఉన్న ఏడుగురూ చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Watch Video: బట్టల దుకాణంలో చెలరేగిన మంటలు.. మూడంతస్తుల భవనంలో నిండుకుటుంబం.. నిద్రలోనే సజీవ దహనం..
Chhatrapati Sambhajinagar
Follow us

|

Updated on: Apr 03, 2024 | 8:44 AM

ఛత్రపతి శంభాజీనగర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలోని ఓ వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 3 గంటలకు మొదలైన ఈ అగ్నిప్రమాదంలో ఊపిరాడక ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. దుకాణం పై అంతస్తులో కుటుంబం నివసించేది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్టుగా తెలిసింది. ఈ ఘటన తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరగటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. చావానీ దానా బజార్ గల్లీలోని మహావీర్ జైన్ టెంపుల్ పక్కనే ఈ క్లాత్ షాప్ ఉండేది. ఈ మూడంతస్తుల భవనంలో ఒక వస్త్ర దుకాణం ఉండగా, ఒక కుటుంబం పై అంతస్తులో నివసించేది.

కాగా, మూడంతస్తుల భవనంలోని బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భవనం పై అంతస్తులో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన సమాచారం స్థానికంగా తీవ్ర దావనంలా వ్యాపించింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బందితో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు.. అయితే ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే, అప్పటికి ఏడుగురు దురదృష్టవశాత్తు మరణించారు. మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించి పోలీసులు పంచనామా నిర్వహిస్తున్నారు. కాగా, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు చెలరేగడంతో మృతదేహాలను బయటకు తీసి శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఘాటి ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ అగ్నిప్రమాదానికి కారణం అర్థం కాలేదని చెప్పారు. కాగా, ఈ భవనంలో మొత్తం 16 మంది ఉన్నట్టుగా సమాచారం.

ఈ ఘటన గురించి అందిన మరింత సమాచారం ప్రకారం, ఘటన జరిగిన సమయంలో మూడు అంతస్తుల భవనంలో మొత్తం 16 మంది ఉన్నారు. మొదటి అంతస్తులో ఏడుగురు నివసిస్తున్నారు. రెండవ అంతస్తులోనూ మరో ఏడుగురు, మూడవ అంతస్తులో మరో ఇద్దరు ఉంటున్నారని తెలిసింది. ఈ షాపులో మంటలు చెలరేగడంతో రెండో అంతస్థులో ఉన్న ఏడుగురూ చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అవిశ్రాంత శ్రమతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు రెస్క్యూ సిబ్బంది. అయితే అప్పటికే దుకాణాలన్నీ దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో అగ్నిమాపక సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. ఈ క్లాత్ షాప్ పేరు కింగ్ స్టైల్ టైలర్స్.

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్