Trending: వామ్మో ఈ ఆంటీ మాముల్ది కాదు.. సెకన్ల వ్యవధిలో సైలెంట్‌గా…

కన్ను మూసి కన్ను తెరిచేసరికి మోసం. క్షణాల్లోనే దొంగతనం. మాయగాళ్లు, కంత్రీ లేడీలు రెచ్చిపోతున్నారు. క్షణాల వ్యవధిలో పర్సులు కొట్టేస్తున్నారు. ఏం జరిగిందో ఆలోచించేలోపు తమ పని కానిచ్చేస్తున్నారు. తాజాగా అలాంటి ఓ దొంగతనం వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Trending: వామ్మో ఈ ఆంటీ మాముల్ది కాదు.. సెకన్ల వ్యవధిలో సైలెంట్‌గా...
Thief
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 03, 2024 | 7:48 PM

ఒకప్పుడు దొంగల్ని పట్టుకోవడం కష్టతరంగా ఉండేది. ఎందుకంటే అప్పుడంత టెక్నాలజీ లేదు. ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి దోచుకెళ్లారో తెలుసుకోవడం కష్టంగా ఉండేది. ఆ తర్వాతి కాలంలో ఫింగర్ ప్రింట్స్, ఇతర క్లూస్ ద్వారా దొంగల భరతం పట్టేవారు పోలీసులు. కానీ ఇప్పుడు గల్లీ.. గల్లీకి.. ప్రతి ఇంటికీ.. ప్రతి షాపుకు సీసీ కెమెరాలు పెట్టిస్తున్నారు. దీంతో చోర వీరులు ఇట్టే చిక్కుతున్నారు. లేడీ దొంగలు సైతం అడ్డంగా దొరికిపోతున్నారు. అలాంటి దొంగతనాలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న వీడియోలో ఒక మహిళ హ్యాండ్ బ్యాగ్ నుంచి చాకచక్యంగా పర్సు కొట్టేసింది ఓ మాయలేడీ.

వైరల్ అవుతున్న వీడియోలో, చాలా మంది వ్యక్తులు వస్తువులను కొనుగోలు చేయడానికి దుకాణం వద్దకు వచ్చారు. ఒక స్త్రీ తన భర్తతో కలిసి ఆ దుకాణం వద్దకు వచ్చి ఏదో కొంటోంది. ఇంతలో అక్కడికి ఆగమేఘాల మీద మరో ఆంటీ వచ్చింది. వయస్సు కాస్త ఎక్కువే. ఆమెను చూసి దొంగ అని ఎవరూ అనుకోరు.  ఆమె రావడం రావడంతోనే పక్కనున్న మహిళ..  హ్యాండ్ బ్యాగ్  జిప్ ఓపెన్ చేసింది. ఆ తర్వాత షాపు అతన్ని కొన్ని వస్తువులు తీసుకురావాలని కోరింది. ఈ సమయంలోనే ఎవరూ లేరని నిర్ధారించుకుని తన పక్కనే ఉన్న మహిళ పర్సును తీసి తన బ్యాగ్‌లో పెట్టుకుంది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా దుకాణం నుంచి వెళ్లిపోయింది. ఈ తతంగమంతా సీసీ కెమెరాలో రికార్డయింది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని వైరల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఓరీ దేవుడో ఈ పంటి ఖరీదు తెలిస్తే కళ్లు బైర్లే..!ప్రపంచంలోనే ఖరీదు
ఓరీ దేవుడో ఈ పంటి ఖరీదు తెలిస్తే కళ్లు బైర్లే..!ప్రపంచంలోనే ఖరీదు