AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solar Eclipse 2024: సూర్యగ్రహణాన్ని తేలికగా తీసుకోకండి, పగటిపూట చీకటి.. అమెరికాలో ప్రత్యేక జాగ్రత్తలు..

భారత కాలమానం ప్రకారం ఈ సూర్యగ్రహణం ఏప్రిల్ 8 రాత్రి 9:12 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 1:25 గంటలకు ముగుస్తుంది. అమెరికా కాలమానం ప్రకారం ఈ గ్రహణం మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రారంభమవుతుంది. సూర్య గ్రహణం సందర్భంగా అమెరికాలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏప్రిల్ 8న అమెరికాలోని పలు రాష్ట్రాల్లో పాఠశాలలు కూడా మూసివేయనున్నారు. సూర్యుని హానికరమైన కిరణాల బారిన పడకుండా రక్షించబడటానికి గ్రహణం సమయంలో అమెరికాలోని పౌరులు ఇంట్లోనే ఉండాలని కోరారు.

Solar Eclipse 2024: సూర్యగ్రహణాన్ని తేలికగా తీసుకోకండి, పగటిపూట చీకటి.. అమెరికాలో ప్రత్యేక జాగ్రత్తలు..
Solar Eclipse
Surya Kala
|

Updated on: Apr 04, 2024 | 9:42 AM

Share

2024 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8, 2024 సోమవారం నాడు సంభవించబోతోంది. హిందూ మతం,  జ్యోతిషశాస్త్రంలో సూర్య గ్రహణానికి సంబంధించిన అనేక నమ్మకాలు ఉన్నాయి. అయితే సైన్స్ లో  దీనిని ఖగోళ సంఘటన అని పిలుస్తారు. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం అనేక విధాలుగా ప్రత్యేకంగా ఉండబోతోంది.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ సూర్యగ్రహణం మొత్తం 4 గంటల 25 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఇది 50 సంవత్సరాల్లో సుదీర్ఘ సమయం ఉంటుంది. ఈ గ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం. ఈ సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించనప్పటికీ అమెరికాలో స్పష్టంగా చూడవచ్చు. ఈ సూర్యగ్రహణం కోసం అమెరికాలో కూడా ప్రత్యేక సన్నాహాలు చేస్తున్నారు.

ఏప్రిల్ 8న పగటిపూట చీకటి

భారత కాలమానం ప్రకారం ఈ సూర్యగ్రహణం ఏప్రిల్ 8 రాత్రి 9:12 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 1:25 గంటలకు ముగుస్తుంది. అమెరికా కాలమానం ప్రకారం ఈ గ్రహణం మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రారంభమవుతుంది. సంపూర్ణ సూర్యగ్రహణం మొత్తం వ్యవధి 4 గంటల 25 నిమిషాల పాటు కొనసాగుతుంది, అందులో మొత్తం భూమి దాదాపు 8 నిమిషాల పాటు చీకటితో కప్పబడి ఉంటుంది. భారతదేశంలో గ్రహణం  కనిపించనప్పటికీ ఈ సూర్యగ్రహణం చాలా దేశాల్లో చూడవచ్చు. అయితే అమెరికాలోని ఉత్తర భాగంలో ఈ సూర్యగ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

సూర్యగ్రహణం కోసం అమెరికాలో ప్రత్యేక సన్నాహాలు

సూర్య గ్రహణం సందర్భంగా అమెరికాలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏప్రిల్ 8న అమెరికాలోని పలు రాష్ట్రాల్లో పాఠశాలలు కూడా మూసివేయనున్నారు. సూర్యుని హానికరమైన కిరణాల బారిన పడకుండా రక్షించబడటానికి గ్రహణం సమయంలో అమెరికాలోని పౌరులు ఇంట్లోనే ఉండాలని కోరారు.

ఏప్రిల్ 8న సూర్యగ్రహణం నేపథ్యంలో అమెరికాలో భయంతో పాటు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. అమెరికాలో సూర్యగ్రహణానికి సంబంధించి ఎయిర్ ట్రాఫిక్, విమానాశ్రయాల్లో కూడా హెచ్చరిక జారీ చేయబడింది.

అమెరికాలోని ప్రజలు గ్రహణ సమయంలో ప్రజలు తమ ఇళ్లను విడిచి బయటకు వెళ్లరాదని.. ఆహారం, గ్యాస్ వంటి అవసరమైన వస్తువులను నిల్వ చేసుకోవాలని కోరారు. రోజు గడుస్తున్న కొద్దీ ఈ సూర్యగ్రహణం కూడా ప్రమాదకరంగా మారవచ్చు. అటువంటి పరిస్థితిలో ప్రజలు అజాగ్రత్తగా ఉండకూడదు. పొరపాటున కూడా సూర్యుని వైపు నేరుగా చూడకూడదు. ఇలా చేయడం వల్ల సూర్యుడి హానికరమైన కిరణాల వల్ల కళ్లు దెబ్బతినే అవకాశం ఉంది.

సూర్యగ్రహణం సమయంలో ఏం చేయాలి?

సూర్యగ్రహణం సమయంలో ఆహారం వండకూడదు. తినకూడదు. సూర్యగ్రహణం సమయంలో వ్యాపించే హానికరమైన కిరణాల వల్ల ఆహారం కలుషితమై ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని నమ్ముతారు. అందువల్ల గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకుండా ఉండండి.

సూర్యగ్రహణం సమయంలో పొరపాటున కూడా దేవుని విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని తాకకూడదు లేదా పూజించకూడదు. ఈ సమయంలో దేవాలయాల తలుపులు మూసి ఉంటాయి.

సూర్యగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గర్భిణీ స్త్రీలు పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. ఈ కాలంలో తులసి, రావి, మర్రి చెట్లను తాకకూడదు.

సూర్యగ్రహణాన్ని ఎప్పుడూ నేరుగా కళ్లతో చూడకూడదు. టెలిస్కోప్ ద్వారా చూడవచ్చు. లేదా ప్రత్యేక సన్ గ్లాసెస్ సహాయంతో కూడా చూడవచ్చు. గ్రహణ సమయంలో దేవుడి నామస్మరణ, మంత్రాలు జపించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు