జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట విరామం తర్వాత రాశిచక్రాలను, రాశులను మారుస్తూ ఉంటాయి. మేషం నుండి మీనం వరకు 12 రాశుల మీద దీని శుభ, అశుభ ప్రభావం పడుతుంది. ఈ క్రమంలోనే జ్ఞానానికి కారకుడైన బుధుడు మరో ఐదు రోజుల్లో తన స్థానాన్ని మార్చుకోనున్నాడు.. ఏప్రిల్ 09 బుధవారం రోజున బుధుడు మీనరాశిలోకి ప్రవేశిస్తారు. ఈ రాశికి బృహస్పతి అధిపతి. శుక్రుడు, సూర్యుడు ప్రస్తుతం ఒకే రాశిలో ఉన్నారు. బుధుడు మీనరాశిలో ప్రవేశించినప్పుడు త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వలన కొన్ని రాశులవారు ఊహించని లాభాలను అందుకుంటారు. ఆయా రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం.