- Telugu News Photo Gallery Drinking too much alcohol at summer season? Very dangerous, check here is details
Alcohol at Summer: మండే ఎండల్లో చిల్ అవ్వడానికి మద్యం సేవిస్తున్నారా.. వెరీ డేంజర్!
వేసవి కాలంలో మీరు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రాణానికే ప్రమాదం. సమ్మర్ సీజన్‌లో ఆహార పరంగా, శారీరంగా కూడా సరైన జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే ఈజీగా జబ్బుల బారిన పడుతూ ఉంటారు. చాలా మంది వేసవిలో చిల్ అవ్వడానికి మద్యాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇలా తీసుకోవడం చాలా ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల వాంతులు, విరేచనాలు, బాడీ డీహైడ్రేషన్‌కు గురవ్వడం వంటివి జరుగుతాయి. ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తీసుకొస్తుందని..
Updated on: Apr 04, 2024 | 2:41 PM

వేసవి కాలంలో మీరు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రాణానికే ప్రమాదం. సమ్మర్ సీజన్‌లో ఆహార పరంగా, శారీరంగా కూడా సరైన జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే ఈజీగా జబ్బుల బారిన పడుతూ ఉంటారు. చాలా మంది వేసవిలో చిల్ అవ్వడానికి మద్యాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.

ఇలా తీసుకోవడం చాలా ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల వాంతులు, విరేచనాలు, బాడీ డీహైడ్రేషన్‌కు గురవ్వడం వంటివి జరుగుతాయి. ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తీసుకొస్తుందని సూచిస్తున్నారు. మరి మద్యం తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగవచ్చో ఇప్పుడు చూద్దాం.

మద్యం తాగేవారికి ఎక్కువగా వడదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. శరీరంలో ఉష్ణోగ్రత లెవల్స్ కూడా పెరిగిపోతాయి. దీని వల్ల డీహైడ్రేషన్‌కు గురవ్వడం, వాంతులు, విరేచనాలు, తలనొప్పి, మూర్ఛ రావడం జరిగి.. ప్రాణానికే ప్రమాదం కలగవచ్చు.

మద్యం తాగినప్పుడు శరీరంలో వేడి అనేది ఎక్కువై.. చెమట ద్వారా బయటకు వెళ్తుంది. దీంతో శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. ఇలా వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అంతే కాకుండా చాలా మంది సమ్మర్‌లో వెకేషన్స్‌కు వెళ్తూ ఉంటారు. సముద్రాలు, నదులు, వాగులు, వంకలు ఉండే ప్రదేశంలో సేద తీరడానికి వెళ్తారు. అక్కడ కూడా మద్యం తాగి చాలా మంది నీటిలోకి వెళ్లి చనిపోతున్నారు. కాబట్టి వీలైనంత వరకూ సమ్మర్‌లో మద్యానికి దూరంగా ఉండటమే బెటర్.




