Best Smartwatches Under 2K: స్మార్ట్ ఫోన్లకు ఏ మాత్రం తీసిపోని స్మార్ట్ వాచ్‌లు.. అతి తక్కువ ధరలోనే..

వాచ్ లంటే గతంలో కేవలం టైం చూసుకోవడానికి మాత్రమే పనికి వచ్చేవి. స్మార్ట్ ఫోన్ల రాకతో దాదాపు అవి కనుమరుగయ్యాయి. ఆధునిక ఫీచర్లతో రూపొందించిన స్మార్ట్ వాచ్ లు ప్రస్తుతం మార్కెట్ ను శాసిస్తున్నాయి. వీటితో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఫైర్ బోల్ట్ బ్రాండ్ స్మార్ట్ వాచ్ లు అత్యాధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. టచ్ డిస్ ప్లే, మంచి ఫిక్సల్ రిజల్యూషన్, జీపీఎస్ కనెక్ట్ విటీ కలిగిన ఉన్న ఈ వాచ్ లు కేవలం రూ.2 వేల లోపు ధరలోనే అందుబాటులో ఉన్నాయి. బీపీ, ఆక్సిజన్, హార్ట్ బీట్ స్థాయిలను ఎప్పటి కప్పుడు పర్యవేక్షించుకునే సౌకర్యం వీటిలో ఉంది. సామాన్య ప్రజలకు కూడా అనుకూలమైన ధరలో ఉన్న ఫైర్ బోల్ట్ బ్రాండ్ స్మార్ట్ వాచ్ లు వివరాలు, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం.

Madhu

|

Updated on: Apr 04, 2024 | 3:16 PM

ఫైర్-బోల్ట్ క్వెస్ట్ స్మార్ట్‌వాచ్.. పూర్తి టచ్ డిస్‌ప్లే, సూపర్ పిక్సెల్ రిజల్యూషన్‌తో అంతర్నిర్మిత జీపీఎస్, బ్లూటూత్ కనెక్టివిటీ దీని ప్రత్యేకతలు. మూడు గంటల చార్జింగ్ తో సుధీర్ఘ బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది. బీపీ, ఆక్సిజన్, హృదయ స్పందన స్థాయి లను పర్యవేక్షించుకోవచ్చు. దీని స్క్రీన్ పరిమాణం 1.39 అంగుళాలు. అత్యుత్తమ ఫీచర్ల గల ఈ వాచ్ రూ.1,899కు వినియోగదారులకు అందుబాటులో ఉంది.

1 / 6
గ్లాడియేటర్ ప్లస్ స్మార్ట్‌వాచ్. గ్లాడియేటర్ ప్లస్ స్మార్ట్ వాచ్ 1.96 అంగుళాల స్క్రీన్ తో ఆకట్టు కుంటోంది. కేవలం 3 గంటల పాటు చార్జింగ్ చేస్తే దాదాపు 7 రోజుల పాటు పనిచేస్తుంది. 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌, 115 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు, బ్లూటూత్ కాలింగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. దుమ్ము, నీరు వంటివి వాచ్ లోపలకు వెళ్లకుండా ప్రత్యేక రక్షణ ఉంది. అలాగే క్రాక్ రెసిస్టెంట్ మరో అదనపు ఆకర్షణ. స్మూత్ ఆపరేషన్, మంచి నాణ్యత కలిగిన ఈ ఫోన్ ధర రూ.2,149.

2 / 6
ఫైర్ బోల్ట్ నింజా కాల్ ప్రోమాక్స్.. 2.01 అంగుళాల పెద్ద డిస్ ప్లే, బ్లూటూత్ కాలింగ్, స్పష్టమైన ఆడియో క్వాలిటీ, మ్యూజిక్ ప్లే బ్యాక్, ఫొటోలు తీసుకోవడం, 120 పైగా స్పోర్ట్ మోడ్లు దీని ప్రత్యేకతలు. వాయిస్ అసిస్టెన్స్, నిద్రస్థాయి తెలపడం, స్ట్రెస్ మేనేజ్మెంట్ తదితర ప్రత్యేకతలు దీనిలో ఉన్నాయి. కాల్స్, మేసేజ్ లు, ఈమెయిల్స్, సోషల్ మీడియా నుంచి నోటిఫికేషన్లు డిస్ ప్లే అవుతాయి. సులభంగా చదవడం, డయల్ చేసుకునే వీలు ఉండడం దీని అనుకూలతలు. అలాగే ఆపరేట్ చేయడాానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దీని ధర రూ.1,299.

3 / 6
ఫైర్-బోల్ట్ గ్లాడియేటర్.. ఈ వాచ్ ను ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు 7 రోజుల పాటు పనిచేస్తుంది. బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి కాల్స్ చేయవచ్చు. మెరుగైన బ్యాటరీ సామర్థ్యం దీని ప్రత్యేకత. ఏఐ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌, 1.96 అంగుళాల స్క్రీన్, కాంతివంతమైన డిస్ ప్లే, యూజర్ ఫ్రెండ్లీ యాప్ లు ఆకట్టుకుంటున్నాయి. ఈ వాచ్ రూ.1,349 ధరకు అందుబాటులో ఉంది. అయితే చిన్న ఫాంట్ కారణంగా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.

4 / 6
ఫైర్ బోల్ట్ టాక్ 2.. అనేక అడ్వాన్స్ డ్ ఫీచర్లు కలిగిన కట్టింగ్ ఎడ్జ్ ఈ వాచ్ రూ.1,499కి అందుబాటులో ఉంది. మెరుగైన బ్యాటరీ సామర్థ్యం కారణంగా ఒక్కసారి చార్జింగ్ చేస్తే 8 రోజులు పనిచేస్తుంది. బ్లూటూత్ కాలింగ్ చేస్తే దాదాపు 3 రోజుల వరకూ వస్తుంది. అంతర్నిర్మిత మైక్, స్పీకర్, సోషల్ మీడియా చానెళ్ల నోటిఫికేషన్ల అలెర్ట్, హెల్త్ ట్రాకింగ్ దీని ప్రత్యేకతలు. 60 రకాల స్పోర్ట్ మోడ్ లలో అందుబాటులో ఉంది. 1.28 అంగుళాల స్క్రీన్, తక్కువ ధర దీని అనుకూలతలు.

5 / 6
ఫైర్-బోల్ట్ వాచ్ నింజా కాలింగ్.. 240*280 పిక్సెల్‌ హెచ్ క్యూ రిజల్యూషన్‌, 1.69 అంగుళాల హెచ్ డీ టచ్ స్క్రీన్, లోపలి స్పీకర్, ఏఐ వాయిస్ అసిస్టెన్స్ కలిగిన ఈ వాచ్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్ సామర్థ్యం, 30 స్పోర్ట్స్ మోడ్‌లు ఆకట్టుకుంటున్నాయి. హార్ట్ బీట్, రక్త పోటు, ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. అద్భుతమైన బ్యాటరీ సామర్థ్యం, స్టైలిష్ లుక్ తో ఆకట్టుకుంటున్న ఈ వాచ్ ధర రూ.1,849 మాత్రమే.

6 / 6
Follow us