Taiwan Earthquake: తైవాన్‌ను కుదిపేసిన భూకంపం.. 9మంది మృతి.. 1000 మందికి గాయాలు.. కొనసాగుతున్న సహాయకచర్యలు..
భారీ భూకంపం తైవాన్‌ను కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై 7.6 గా నమోదైన ఈ భూకంపంలో ఇప్పటి వరకు తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య పెరిగి అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 100 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకోగా.. 730 మందికిపైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు.
భారీ భూకంపం తైవాన్ ద్వీపాన్ని హడలెత్తించింది. గత 25 ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా భారీ భూకంపం సంభవించింది. భూకంపం దాటికి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అత్యంత భారీ భూకంపం తైవాన్‌ను కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై 7.6 గా నమోదైన ఈ భూకంపంలో ఇప్పటి వరకు తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య పెరిగి అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 100 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకోగా.. 730 మందికిపైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు. భారీ భూకంపం దాటికి పలు వంతెనలు, ఫ్లైఓవర్లు, భవనాలు, మెట్రో రైళ్లు, స్విమ్మింగ్ ఫూల్స్ ఊగిపోయాయి. భూకంపం కారణంగా పదుల సంఖ్యలో భవనాలు నేలకూలాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. చాలా చోట్ల రోడ్లు దెబ్బ తిన్నాయి. దీంతో ప్రజలు భయాందోళనతో పరుగులు పెట్టారు.
తైవాన్ రాజధాని తైపీ నగరంలోని ఓ ఫ్లైఓవర్ కొన్ని నిమిషాల పాటు కదిలింది. దానిపై ఉన్న వాహనదారులు భయంతో ఎక్కడికక్కడే ఆగిపోయారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ విపత్తు సంభవించింది. తైవాన్ వ్యాప్తంగా రైలు సేవలను నిలిపివేశారు. తైపీలో సబ్‌వే సేవలను రద్దు చేశారు. జపాన్ దక్షిణ ప్రాంతంలోని పలు దీవుల్లోనూ ప్రకంపనలు కన్పించాయి. దీంతో తొలుత భారీ సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణాన హౌలెన్ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది.
తైవాన్, జపాన్, ఫిలిప్సీన్స్ సహా పలు దేశాల్లో తరుచూ భూకంపాలు సంభవిస్తాయి. గత పాతికేళ్లలో ఈ స్థాయిలో అక్కడ భూకంపం సంభవించడం ఇదే తొలిసారి. 1999 సెప్టెంబరులో నాంటౌ కౌంటీలో 7.2 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి సుమారుగా 2,500 మందికి పైగా మరణించారు. 1,300 మందికి పైగా గాయపడ్డారు. జపాన్‌లో ప్రతిఏటా సుమారు 1500 వరకూ భూకంపాలు వస్తుంటాయి. తైవాన్‌లో సంభవించిన భూకంపంతో జపాన్ సహా మరికొన్ని దేశాల్లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీచేశారు. జపాన్‌లోని దీవులకు సుమారు 3 మీటర్ల మేర సముద్ర అలలు ఎగిసిపడి సునామీ వచ్చే అవకాశం ఉందని వాతావరణ సంస్థ అంచనా వేసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..