Libya PM: లిబియా ప్రధాని నివాసంపై రాకెట్ దాడి.! రాజకీయ అస్థిరతకు తోడు మరో కలకలం
లిబియా ప్రధాని అబ్దుల్ హమీద్ అల్-దబేబా నివాసంపై ఆదివారం రాకెట్ గ్రనేడ్ దాడి జరిగింది. ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని ఓ మంత్రి తెలిపారు. భవనం స్వల్పంగా ధ్వంసమైనట్లు చెప్పారు. ప్రధాని ఇంటికి సమీపంలో పెద్ద పేలుడు శబ్దాలు వినిపించినట్లు రాయిటార్స్ తెలిపింది. వెంటనే పెద్ద ఎత్తున భద్రతా బలగాలను ప్రభుత్వం మోహరించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
లిబియా ప్రధాని అబ్దుల్ హమీద్ అల్-దబేబా నివాసంపై ఆదివారం రాకెట్ గ్రనేడ్ దాడి జరిగింది. ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని ఓ మంత్రి తెలిపారు. భవనం స్వల్పంగా ధ్వంసమైనట్లు చెప్పారు. ప్రధాని ఇంటికి సమీపంలో పెద్ద పేలుడు శబ్దాలు వినిపించినట్లు రాయిటార్స్ తెలిపింది. వెంటనే పెద్ద ఎత్తున భద్రతా బలగాలను ప్రభుత్వం మోహరించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 2011 నుంచి లిబియాలో శాంతిభద్రతల సమస్యలు కొనసాగుతున్నాయి. పాలనపై పట్టుకోసం 2014లో తూర్పు, పశ్చిమ కింద వైరి వర్గాలు ఏర్పడి ఎవరికి వారు సొంతంగా పాలనను కొనసాగిస్తున్నాయి. 2021లో అబ్దుల్ హమీద్ అల్-దబేబా నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసింది. కానీ, ఆ ఏడాది చివరికల్లా తూర్పు ప్రాంతంలోని పార్లమెంట్ దీన్ని అధికారికంగా గుర్తించడానికి నిరాకరించింది. జాతీయ స్థాయి ఎన్నికల నిర్వహణకు చేసిన ప్రయత్నం ఫలించకపోవడమే దీనికి కారణం. దీంతో అప్పటి నుంచి రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. సుదీర్ఘకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికల నిర్వహణను సజావుగా చేపట్టేలా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని దేశంలోని ముగ్గురు కీలక నేతలు మార్చిలో అంగీకరించారు. కానీ, ప్రధాని మాత్రం ఎన్నికలు జరిగే వరకు పదవి నుంచి తప్పుకునేది లేదని తేల్చి చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.