Indian students: భారత విద్యార్థులకు అమెరికా రాయబారి సూచనలు.!
అమెరికాలో భారతీయ విద్యార్థులపై వరుస దాడుల నేపథ్యంలో భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని అమెరికా లాంటి పెద్ద దేశంలో ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయని, సూచించారు. తాజాగా ఆయన జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న ఓ బాధిత కుటుంబంతో తాను మాట్లాడానన్నారు.
అమెరికాలో భారతీయ విద్యార్థులపై వరుస దాడుల నేపథ్యంలో భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని అమెరికా లాంటి పెద్ద దేశంలో ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయని, సూచించారు. తాజాగా ఆయన జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న ఓ బాధిత కుటుంబంతో తాను మాట్లాడానన్నారు. వారి పరిస్థితికి తన హృదయం ద్రవించిందనీ నిందితులకు శిక్ష పడేలా చేస్తామనీ తెలిపారు. ఇలాంటి విషయాలను తాము సీరియస్‌గా తీసుకుంటామనీ ఆయన అన్నారు. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపిన ఆయన బాధితులకు న్యాయం లభించేందుకు అమెరికా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
దాడుల బారిన పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. తమ మిత్రులు, ఇతర విద్యార్థులతో నిత్యం టచ్‌లో ఉండాలని, భద్రతపై అవగాహన, సంసిద్ధత పెంచుకోవాలని సూచించారు. ఈ దిశగా యూనివర్సిటీల్లోని వనరులను వినియోగించుకోవాలని చెప్పారు. విద్యార్థులు బృందాలుగా పర్యటించాలని అన్నారు. రిస్కీ బిహేవియర్‌తో ఉండటం, డ్రగ్స్ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దని సూచించారు. విదేశాల్లో పర్యటించే అమెరికన్లకూ తాము ఇవే సూచనలు చేస్తామని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో ఇలాంటి ఘటనలు తక్కువగా జరగడంపై కూడా గార్సెటీ స్పందించారు. అమెరికాలో కొన్ని సవాళ్లు ఉన్న మాట వాస్తవమే అయినా గతంలో కంటే పరిస్థితి బాగా మెరుగుపడిందని చెప్పారు. భద్రతా పరంగా భారతీయులకు అమెరికా అనువైన దేశమన్న ఆయన తమ ప్రభుత్వం విదేశీ విద్యార్థులకు అమిత ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

