ఉగాదికి మల్లన్న కోసం కన్నడ భక్తులు పాదయాత్ర.. ఎండనుసైతం లెక్క చేయక ఆడబడుచుకు సారెతో తరలివస్తున్న భక్తులు

నల్లమల అడవిలో కన్నడ భక్తుల పాదయాత్ర కొనసాగుతోంది. ఎండను సైతం లెక్కచేయకుండా శ్రీశైలానికి వేలాదిగా తరలివస్తున్నారు కన్నడ భక్తులు. భ్రమరాంబ అమ్మవారిని తమ ఆడపడుచుగా భావించే కన్నడిగులు చీరసారెలతో ఎండను సైతం లెక్కచేయకుండా తరలివస్తున్నారు. నల్లమల బాటలన్నీ మల్లన్న సన్నిధి వైపే అన్న చందంగా కన్నడ భక్తుల భజనలతో మార్మోగుతుంది శ్రీశైలం.

ఉగాదికి మల్లన్న కోసం కన్నడ భక్తులు పాదయాత్ర.. ఎండనుసైతం లెక్క చేయక ఆడబడుచుకు సారెతో తరలివస్తున్న భక్తులు
Srisailam Kannada Devotees
Follow us

| Edited By: TV9 Telugu

Updated on: Apr 05, 2024 | 6:00 PM

నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఈనెల 6 నుండి 10 వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేవాది దేవుడిని తనివి తీరా దర్శించుకునేందుకు నల్లమల అడవి మార్గం గుండా కాలినడకన పాదయాత్రగా కన్నడ భక్తులు వేలాది తరలివస్తున్నారు. నల్లమల అంతా  ఓం కార నాదంతో ప్రతిధ్వనిస్తోంది. ఉగాది పర్వదినం సమీపిస్తుండటంతో శ్రీ గిరి మల్లయ్యను ధ్యాన మల్లన్న తండ్రి అదుకో అంటూ ఆర్తితో పిలుస్తూ శ్రీ గిరి కొండకు చేరుకుంటున్నారు. నల్లమల అరణ్యం గుండా కాలినడకన వస్తున్న వారికి దేవస్థానం పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించింది. ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం గ్రామం వద్ద మంచినీటి సౌకర్యం గతం కంటే బాగుందని అయితే.. అటవీ మార్గం మధ్యలో కొద్దిగా ఇబ్బంది ఉన్న ఏర్పాట్లు బాగున్నాయని కన్నడ భక్తులంటున్నారు.

నల్లమల బాటలన్నీ మల్లన్న సన్నిధి వైపే కన్నడ భక్తుల భజనలతో మార్మోగుతోంది శ్రీశైలం. మరో పక్క వైద్య సదుపాయాలు బాగున్నాయని అడవి మార్గంలో బీమ కొలను మీదుగా కొండెక్కి కన్నడిగులు పాదయాత్రగా నడుచుకుంటూ వస్తున్నారు. ఈ నేపద్యంలో దేవస్థానం అధికారులు లక్షలు ఖర్చుపెట్టి కాలి నడకన నల్లమల నుంచి వచ్చే కన్నడ భక్తులకు వైద్య సౌకర్యాలు కల్పించారు. పాదయాత్ర భక్తుల కోసం అడవిమార్గంలో రాళ్లు రప్పలు లేకుండా చూశారు. కాలినడకన వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రహదారి వెంట వాటర్ ట్రాంకర్లతో నీరు చల్లుతున్నారు. భక్తులకు మార్గమధ్యలో దేవస్థానం సహకారంతో స్వచ్చంద సేవకార్యకర్తలు అన్నదాన ఏర్పాటు చేశారు.

కన్నడ భక్తులు శ్రీశైలం శ్రీ భ్రమరాంబికాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఆడపడుచును తనివితీరా చూసేందుకు ఎండను సైతం లెక్కచేయకుండా మండుటెండలో ఎంతో భక్తి శ్రద్ధలతో వెంకటాపురం నుంచి  దట్టమైన అటవీప్రాంతంలో సుమారు 40 కిలోమీటర్లు నడుచుకుంటున్న వస్తున్నారు. పాదయాత్ర కన్నడ భక్తుల కోసం పలువురు దాతలు కూడా మజ్జిగ, పండ్లు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. భక్తుల సౌకర్యాలపై దేవస్థానం ఈవో పెద్దిరాజు ప్రత్యేక దృష్టి పెట్టడం సంతోషంగా ఉందని పలువురు కన్నడ భక్తులు తెలిపారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!